e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home వనపర్తి రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు

  • రాష్ట్రంలో 2,601 ‘వేదికలు’ నిర్మించాం
  • అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ
  • సాగుభూమి 1.51 కోట్ల ఎకరాలు
  • ధరణిలో 10 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్‌
  • చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు మేలు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు

వనపర్తి రూరల్‌, జూన్‌ 22: తెలంగాణలో సాగు, తాగునీటికి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, లిఫ్టులు, మిషన్‌భగీరథ పథకంతో ఇబ్బందులు లేకుండా చేసిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కిష్టగిరి, చిట్యాల పడమటితండా, అంకూర్‌ గ్రామాల్లో మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు అందించడంతో సాగు ముమ్మరంగా సాగుతున్నదన్నారు. రెవెన్యూలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు భూముల రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే పాస్‌బుక్కులను అందించడం జరుగుతుందన్నారు.

రైతుల బాగుకోసమే ప్రభుత్వం రాష్ట్రంలో 2,601 రైతువేదికలను నిర్మించిందన్నారు. రానున్న రోజుల్లో రైతువేదికలు రైతులకు సాగు విజ్ఞానం అందించే క్షేత్రాలుగా మారనున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిద్దిదేందుకు పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం పల్లెప్రకృతి వనాలు, క్రిమిటోరియం, నర్సరీలు, సెగ్రిగేషన్‌షెడ్లు, పెద్ద గ్రామ పంచాయతీల్లో మార్కెట్‌ యార్డులు ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని పథకాలు రైతులకు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. అంతకుముందు పెద్దగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌ గదులను, మీసేవ కేంద్రాన్ని, ప్రత్యేక మార్కెట్‌, రైతువేదికను ప్రారంభించారు. కిష్టగిరిలో క్రిమిటోరియం, చిట్యాల పడమటితండాలో రూ. 2.46కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను, అంకూర్‌లో రైతు వేదికను ఆయా గ్రామ సర్పంచులు, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ మల్లయ్య, వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, డీపీవో సురేశ్‌కుమార్‌, డీఈవో రవీంద్ర, వైస్‌ ఎంపీపీ సువర్ణ, వనపర్తి, నాగవరం,రాజనగరం పీఏసీసీఎస్‌ చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, గొర్రెల కాపరుల సంఘం జిల్లా కన్వీనర్‌ కురుమూర్తియాదవ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సింహ, ఎంపీటీసీలు రంగారెడ్డి, ధర్మశాస్త్రి, రాజేశ్వరి, కోఆప్షన్‌ మెంబర్‌ శంషొద్దీన్‌, ఆయా గ్రామాల సర్పంచులు కొండన్న, రవీందర్‌, పుల్జీన్‌నాయక్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, భానుప్రకాశ్‌రావు, రామకృష్ణ, దేవేంద్రం, టీఆర్‌ఎస్‌ నాయకులు మాణిక్యం, శివన్న, బాలకృష్ణ, అశోక్‌కుమార్‌, బుచ్చిబాబు, శ్రీనివాసులు, లక్ష్మీకాంత్‌రెడ్డి, విష్ణుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు
రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు
రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు

ట్రెండింగ్‌

Advertisement