e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home వనపర్తి WANAPARTHY: రాష్ట్రంలో పాడివృద్ధి గణనీయంగా పెరుగుతున్నది: మంత్రులు తలసాని, సింగిరెడ్డి

WANAPARTHY: రాష్ట్రంలో పాడివృద్ధి గణనీయంగా పెరుగుతున్నది: మంత్రులు తలసాని, సింగిరెడ్డి

  • మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి
  • గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి
  • దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ
  • జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్యశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

వనపర్తి రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలో పాడి పశుసంపద, జీవాల పెంపుదలకు ఎంతోగానో కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మర్రికుంట పాలశీతల కేంద్ర ఆవరణలో గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంతీయ పశువైద్యశాల భవన నిర్మాణ పనులను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములుతో కలిసి రాష్ట్ర పశుసంవర్థక, మత్య్స, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సందర్శించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పశు, జీవాల కోసం 2 ఏకరాల స్థలంలో సంత ఏర్పాటుకు నిధులు అందిస్తానన్మారు. త్వరగా వాటిని పూర్తి చేసి సంత నిర్వహించుకొనే సోసైటీ సభ్యులు పనులు వేగిరం చేయాలన్నారు. అనంతరం పశుసంవర్థక కార్యాలయంలో నూతన ప్రాంతీయ పశువైద్యశాల భవన నిర్మాణ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడుతూ త్వరగా గొర్రెల పంపిణీలో పెండింగ్ ఉన్న వాటితో పాటు కొత్తగా అమలు చేసి గొర్రెల యూనిట్ పాలసీకి మార్చి డీడీ కట్టించాలని, దసరా పండుగ తరువాత లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకొవాలని సూచించారు.

- Advertisement -

భవన నిర్మాణం పనుల త్వరగా పూర్తి చేసి ప్రారంభించుకోవాలన్నారు. జిల్లాలో పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉందని, దానికి తగ్గటుగా యూనిట్లు కూడా అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం పశు వైద్యశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసి దిశ స్మతివనం, పశుగ్రాస క్షేత్రాన్ని మంత్రులు ఎంపీలు కలిసి రిబ్బన్ కట్టు చేసి ప్రారంభించారు అదేవిధంగా స్మతివనంలో మొక్కలు నాటారు.

వ్యవసాయ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు
కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వరావుపేటలో ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతుల క్షేత్ర విజ్ఞాన యాత్రను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో వరి సాగు ఒక్కటే కాకుం డా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విజ్ఞాన యాత్రలు ఎంతోగానో ఉప యోగపడుతాయన్నారు.

క్రిషక్‌భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ వారు రైతుల కోసం చేపట్టిన యాత్ర విజయవంతం కావాల న్నారు. జిల్లా కేంద్రం నుండి దాదాపు 67 మంది రైతులు రెండు రోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు. ఆయిల్‌పామ్ తోటల పెంపకం ద్వారా రైతులు మరింత ఆర్థిక అభివృద్ధి సాధించ వచ్చునన్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రులను శాలువాలు, పూలబోకేలతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమైఖ్య అధికారి కవిత, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేశ్, గొర్రె కాపరుల సహకార వైస్ చైర్మన్ చంద్రయ్య, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, వార్డు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement