e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home వనపర్తి Wanaparthy: అభివృద్ధిలో చందాపూర్ ఇతర గ్రామాలకు ఆదర్శం: మంత్రి నిరంజన్‌రెడ్డి

Wanaparthy: అభివృద్ధిలో చందాపూర్ ఇతర గ్రామాలకు ఆదర్శం: మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్: చందాపూర్ గ్రామంలో చూస్తున్న అభివృద్ధి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చందాపూర్ గ్రామంలో పర్టిలైజర్ దుకా ణాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషలతో కలిసి పల్లె ప్రకృతి వనం, మరింత హాంగులతో రూపోందించిన రైతు వేదికలను పరిశీలించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వనంలో సర్పంచ్ చెన్నారెడ్డి కృషి వల్ల చెట్లు ఏపుగా పెరిగాయన్నారు. దానిలో అరటి, జామ, అల్లనేరేడు, మామిడి, సపోట, టేకు, పూల చెట్లతో ఎంతో చక్కగా ఉంది. అరటి పండ్లు త్వరలోనే పాకానికి వస్తాయి. సర్పంచ్ కృషికి గ్రామస్థుల తోడ్పాటు, సహకారం అభినందనీయం, గతంలో గ్రామం అపరిశుభ్రంగా ఉండేది నేడు సంపూర్ణ మార్పు వచ్చింది. ప్రభుత్వం నిధులిచ్చినా మనసుపెట్టి పనిచేస్తే ప్రజాప్రతినిధులతో ఇది సాధ్యమవుతుందన్నారు.

- Advertisement -

వచ్చే జడ్పీ సమావేశం ఇక్కడే నిర్వహించి సభ్యులకు గ్రామాభివృద్ధిని చూపించాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు, ఎంపీడీవోలతో కలిసి గ్రామాలాభివృద్ధిపై ఇక్కడే సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలాభివృద్దిలో సంకుచిత మనస్తత్వం వదిలేసి, అభివృద్ధిలో గ్రామస్థులను భాగస్వాములను చేసి ముందుకు సాగితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో దానికి చందాపూర్ ఉదాహరణ అని అన్నారు.

వ్యవసాయంలో తోటి రైతులతో అధిక దిగుబడి సాధించే దానిలో పోటీతత్వం పెరగాలన్నారు. అసూయ, ద్వేషాలకు అం దరం దూరంగా ఉండి గ్రామం, మనం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. యాసంగిలో రైతులు పంట మార్పు చేసుకొని వేరుశనగ, మినుములు ఇతరత్రా పంటలపై దృష్టి సారించాలన్నారు.

ఆయిల్‌ఫామ్ తోటల వల్ల రైతులకు ఆధిక లాభం చేకూరుతుందన్నారు. జిల్లాలో కడుకుంట్లలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం నర్సరీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే ప్యాక్టరీలు కూడా ఏర్పాటు కానున్నాయన్నారు. చందాపూర్‌తో పాటు చుట్టూ గ్రామాలకు సాగు నీరందించే దిశగా రామన్నగుట్ట ప్రాంతంలో 1.5 టీఎంసీ రిజర్వయిర్ ఏర్పాటు చేసే ఫైల్ సీఎం అనుమతి కోసం పంపించామన్నారు.

దానితో సాగు నీటి సమస్య తీరుతుందన్నారు. ఈ ఏడాది యాసంగిలో సాగు నీరందస్తామని, కానీ రైతులు వరి సాగు చేయకుండా ఇతరత్ర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్‌బెడ్ రూం ఇండ్లను అందిస్తామన్నారు.

ఇప్పటి వరకు రైతులతో ఈ రైతువేదికలో 28 సమావేశాలు జరిపి రైతు వేదికను సద్వినియోగం చేస్తుండడం అభినందనీ యం, ఏడేండ్లలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. వ్యవసాయం, కరెంటు విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సమూల మార్పులు వచ్చాయన్నారు.

దేశంలోనే ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పం చ్ చెన్నారెడ్డిని మంత్రి నిరంజన్‌రెడ్డి శాలువ, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ చెన్నారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రావ్, మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షు డు పురుషోత్తం రెడ్ది, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నరసింహా, మార్క్‌ఫైడ్ కమిటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement