e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ధన్వాడ, మే 28 : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో 1,275 సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉన్నారని మండలంలో ఉన్న సూపర్‌ స్ప్రెడర్లు అందరూ వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. శనివారం వరకు వంద శాతం వ్యాక్సినేషన్‌ అయ్యే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేయించుకోవాలని కోరారు. దవాఖాన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు పైకి వచ్చే వారికి జరిమానా విధించాలని కలెక్టర్‌ తాసిల్దార్‌ బాల్‌చందర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఐవో శైలజ, డాక్టర్‌ వెంకటదాస్‌, మెడికల్‌ ఆఫీసర్‌ స్వాతి పాల్గొన్నారు.
కోటకొండ పీహెచ్‌సీ పరిశీలన
నారాయణపేట రూరల్‌, మే 28 : మండలంలోని కోటకొండ ఆరోగ్య కేం ద్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి ఎంత మందికి వ్యాక్సిన్‌ వేశారని వివరాలను వైద్యురాలు సంతోషిని అడిగి తెలుసుకొన్నారు. ప్రతిరోజు ఎంత మందికి కరో నా పరీక్షలు చేస్తున్నారు, వారికి సరైన మందులు అందజేస్తున్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌, ఫార్మసిస్టు వెంకటేశ్‌, ఏఎన్‌ఎం యశోద ఉన్నారు.
కొనసాగుతున్న సేవ కార్యక్రమాలు
జడ్చర్లటౌన్‌, మే 28 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలువురు దాతలు పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చి సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. శుక్రవారం జడ్చర్లలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారె డ్డి మార్కెట్‌ యార్డులో రైతులకు భోజనం, శానిటైజర్లను పంపిణీ చేశారు. అ దేవిధంగా టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు వైజీ ప్రీతమ్‌ ఆధ్వర్యంలో జడ్చర్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద బాటసారులకు భోజనం, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఈటే శ్రీను ఆధ్వర్యంలో ప్రధా న రహదారులపై బాటసారులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వంశీ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మీనా జ్‌, కౌన్సిలర్లు రహీమొద్దీన్‌, విజయ్‌, నర్సింహలు, ఖయ్యూం, అనిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ట్రెండింగ్‌

Advertisement