e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు రైతులనుంచి ధాన్యం కొంటాం

రైతులనుంచి ధాన్యం కొంటాం

రైతులనుంచి ధాన్యం కొంటాం

మరో 10 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి
జిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణ
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

నారాయణపేట, మే 27 : జిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని, మరో 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో అక్కడక్కడ సంచులు, లారీల కొరతతో ఆలస్యమవుతుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై సివిల్‌ సైప్లె, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. మన ప్రాంతంలో రైస్‌ మిల్లులు లేనందున ప్రభుత్వ అనుమతితో ఇప్పటికే 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మహబూబ్‌నగర్‌కు తరలించామన్నారు. ఆ కోటా పూర్తి అయిందని, మళ్లీ తీసుకోరేమోనని అధికారులు తన దృష్టికి తీసుకురాగా, వెంటనే మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్‌రావుతో అదేవిధంగా హైదరాబాద్‌లోని సివిల్‌ సైప్లె అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా మరో 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇస్తామన్నారని, ఆ అనుమతి వచ్చేంత వరకు వేచి ఉండకుండా ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని సూచించామన్నారు.

ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరం అవుతాయానే విషయంపై జిల్లా వ్యవసాయ అధికారులతో, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మాట్లాడామన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతు వేదికలను పది రోజుల్లో పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఈఈని ఆదేశించామన్నారు. ప్రభుత్వం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి పంచాయతీ శాఖ తరపున రూ.3 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధుల్లో ఎక్కువ శాతం అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తామన్నారు. కోటకొండ పీహెచ్‌సీకి ప్రహారీ, జాజాపూర్‌ పాఠశాల ప్రహరీ నిర్మాణంతోపాటు ఆరోగ్య కేంద్రాలను, పాఠశాలల మరమ్మతులు చేపడతామన్నారు.
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ
నారాయణపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నారాయణపేట పట్టణానికి చెందిన వెంకట్రాములుకు రూ.60వేలు, అశ్వినికి రూ.22వేలు, బానుప్రకాశ్‌కు రూ.40వేలు, వెంకటేశ్‌కు రూ.60వేలు, నారాయణపేట మండలం కొల్లంపల్లికి చెందిన చిన్న సాయిలుకు రూ.60వేలు, కృష్ణ నాయక్‌కు రూ.27వేలు, కతలప్పకు రూ.60వేలు, భైరంకొండ గ్రామానికి చెందిన నారాయణమ్మకు రూ.60వేలు, పేరపళ్ల తండాకు చెందిన దేవానంద్‌కు రూ.28వేలు, సింగారం గ్రామానికి చెందిన శంకరమ్మకు రూ.12వేల 500లు, అమృతమ్మకు రూ.56వేలు, శేర్నపల్లికి చెందిన రాములుకు రూ.14వేలు, పేరపళ్లకు చెందిన లక్ష్మారెడ్డికి రూ.1లక్ష, అభంగాపూర్‌ గ్రామానికి చెందిన కాశప్పకు రూ.36వేలు, ఆశప్పకు రూ.18వేలు గనిమొనిబండకు చెందిన భీమప్పకు రూ.12వేలు,

జాజాపూర్‌కు చెందిన కమరప్పకు రూ.48వేలు, దామరగిద్ద మండలం బాపన్‌పల్లి నివాసి చందప్పకు రూ.48వేలు, పిడెంపల్లికి చెందిన రాంచంద్రప్పకు రూ.28వేలు, మల్‌రెడ్డిపల్లికి చెందిన నందనకు రూ.18వేలు, ధన్వాడ మండలం కిష్టాపూర్‌కు చెందిన లక్ష్మమ్మ కు రూ.45వేలు, గున్ముక్లకు చెందిన చిన్నయ్యగౌడ్‌కు రూ.60వేలు, గోటూర్‌కు చెందిన పద్మమ్మకు రూ. 36వేలు, ధన్వాడకు చెందిన వెంకటేశ్వరమ్మకు రూ. 5వేలు, మరికల్‌ మండలం మరికల్‌కు చెందిన నర్సిరెడ్డికి రూ.24వేలు, పెద్ద చింతకుంటకు చెందిన గోవర్ధన్‌కు రూ.12వేలు, తీలేరుకు చెందిన రాములుకు రూ.60 వేలు, శ్రీనివాస్‌గౌడ్‌కు రూ.60వేలు, మాద్వార్‌కు చెందిన కె.అనిల్‌కు రూ.40వేలు, పి.ఈశ్వరమ్మకు రూ.34వేలు, పసుపులకు చెందిన ప్రియాంకగౌడ్‌కు రూ.36వేల చెక్కును అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖారెడ్డి, జెడ్పీ కో అప్షన్‌ సభ్యుడు తాజొద్దీన్‌, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ కన్న జగదీశ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులనుంచి ధాన్యం కొంటాం

ట్రెండింగ్‌

Advertisement