e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home వనపర్తి ఎవరూ బయటకు రావొద్దు

ఎవరూ బయటకు రావొద్దు

ఎవరూ బయటకు రావొద్దు

వనపర్తి, మే 25 : ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దని డీఎస్పీ కిరణ్‌కుమా ర్‌ ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు మధుసూదన్‌, షఫి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొని పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులు, వీధుల గుండా తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఎస్పీ అపూర్వరా వు ఆదేశాల మేరకు కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు అందరూ సహకరిస్తున్నారని, పట్టణంలో వార్డుల్లోని చిన్న చిన్న షాపుల వ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌ నియమాలను పాటించకుండా తెరిచి ఉంచుతున్నారని, వారు కూడా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ నియమాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సైలు వరలక్ష్మి, నస్రీన్‌, ఏఎస్సై రంగస్వామి, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షలు కట్టుదిట్టం
మదనాపురం, మే 25 : లాక్‌డౌన్‌ ఆంక్షలను మం డలంలో మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్సై తిరుపాజి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సిబ్బందితో కలిసి ఎస్సై వాహనాల తనిఖీ నిర్వహించి, అనుమతు లు లేని వాహనాలకు జరిమానా విధించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది శ్రీనివాసులు, కుర్మయ్యగౌడ్‌, బాల్‌రాజు, శ్రీను, సాములు, శివారెడ్డి, ఖాజా, జైల్‌సింగ్‌, రమేశ్‌ ఉన్నారు.

ప్రశాంతంగా లాక్‌డౌన్‌
వనపర్తి రూరల్‌, మే 25 : మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటిస్తూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించకుం డా ప్రతి రోజు రూరల్‌ పోలీసులు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.

ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, మే 25 : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10గంటల తర్వాత మండల కేంద్రంలోని బస్టాండ్‌ అవరణతో పాటు, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్‌ రోడ్లలో ఉన్న షాపులన్నీ మూసిఉంచడంతో నిర్మానుష్యంగా మారిం ది. అదేవిధంగా పలు వీధుల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్త్తూ ఇండ్లలోనే ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎవరూ బయటకు రావొద్దు

ట్రెండింగ్‌

Advertisement