e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home వనపర్తి ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు

ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు

ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు
  • కరోనా పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు కూడా ప్రసవాలు
  • జిల్లాలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు
  • డీఎంహెచ్‌వో చందూనాయక్‌

వనపర్తి రూరల్‌, జూన్‌ 23 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో అ న్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారని డీఎంహెచ్‌వో చందూనాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వచ్చిన గర్భిణులకు కూడా ఇక్కడనే ప్ర సవం చేస్తారని తెలిపారు. గర్భిణులకు జిల్లా దవాఖానలో 24 గంటల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని రకాల జనరల్‌ ఫిజిషియన్‌, మత్తు మందు వైద్యుడు, మానసిక వైద్యుడు, ఎముకల వైద్యుడు, కంటి వైద్యుడు, చెవు, ము క్కు, గొంతు వైద్యుడు, ప్రసూతి వైద్యులు అందుబాటులో ఉన్నారని, అందుకు ప్రజలు సంకోచించకుండా ప్రభుత్వ దవాఖాన సేవలను అందుకోవాలన్నారు. త్వరలోనే ఎంసీహెచ్‌ ప్రారంభం కానున్నందని, అందులో పూర్తి స్థాయి స్టాప్‌ తో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.

గతంలోనే జిల్లాకు ఆర్టీపీసీఆర్‌ సెంటర్‌ను మంజూ రు చేసిందని అది ఇప్పడు డ్రైరన్‌ అవుతుందని తెలిపారు. ప్ర తి రోజు అవుట్‌ పేషంట్‌ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయన్నారు. అదేవిధంగా దవాఖాన ఆవరణలో బ్లడ్‌ బ్యాంక్‌ ఉన్నందు వల్ల ఎటువంటి శస్త్ర చికిత్సలైన ఇక్కడనే నిర్వహించుకొనే అవకాశం ఉందన్నారు. జిల్లాలో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనితో ప్రజలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు వైద్యకళాశాల మంజూరు కావడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయన్నా రు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజలే కాకుండా అ న్ని వర్గ్గాల ప్రజలు ప్రభుత్వ సేవలు అందుకొనేలా ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో వసతులను సమకూర్చుతుందన్నారు. అనంతరం జిల్లా దవాఖానలో వార్డులను పరిశీలించారు. సమావేశంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ హరీశ్‌సాగర్‌, వైద్యులు చైతన్య, పల్లవి, అరుణ, రాజుకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు
ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు
ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు

ట్రెండింగ్‌

Advertisement