e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు కరోనా రోగులకు భోజన వసతి : డీఎస్పీ

కరోనా రోగులకు భోజన వసతి : డీఎస్పీ

కరోనా రోగులకు భోజన వసతి : డీఎస్పీ

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, మే 17 : జిల్లా కేంద్రంలో ని ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా బాధితులు, వారి సహాయకులకు ఉచితంగా భోజన వసతిని మహబూబ్‌నగర్‌ డీ ఎస్పీ శ్రీధర్‌ ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుశ్రతా ప్రజావైద్యశాల, మల్లిక, నేహాసన్‌షైన్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చారు. కార్యక్రమానికి డీఎస్పీ హాజరై భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా కరోనా రోగులకు భోజన వ సతి కల్పించేందుకు ముందుకు రావాలని కోరారు. ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ దవాఖానల వైద్యులు మధుసూదన్‌రెడ్డి, మహేశ్‌బాబు, విజయ్‌కాంత్‌ను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌ పాల్గొన్నారు.
నిరాశ్రయులకు అన్నం ప్యాకెట్లు
మక్తల్‌ టౌన్‌, మే 17: లాక్‌డౌన్‌ సందర్భంగా నిరాశ్రయులుగా ఉన్న వారికి అన్నం ప్యాకె ట్లు అందజేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ నా యకుడు శివారెడ్డి, దామోదర జ్యువెల ర్స్‌ తాళంపల్లి రమేశ్‌ అన్నారు. సోమవారం ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో, బస్టాండ్‌, దవాఖాన దగ్గ ర నిరాశ్రయులుగా ఉన్న వారికి తాళంపల్లి రమేశ్‌ అన్నం ప్యాకెట్లు, వాటర్‌ బాటిల్స్‌ దానం చేసారు. అదేవిధంగా ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకుడు శివారెడ్డి అనాథలకు వృద్ధులకు అన్నం ప్యాకెట్లు దానం చేశారు. అదేవిధంగా గాయత్రి ట్రేడర్స్‌ దుర్గ పుట్టినరోజు సందర్భంగా అనాథలకు అన్న ం ప్యాకెట్లు దానం చేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఉన్నంతవరకు నిరాశ్రయులకు అన్నదానం చేస్తానన్నారు. కార్యక్రమంలో కంసలి వినోద్‌, జగదీశ్‌, రాఘవేంద్రస్వా మి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా రోగులకు భోజన వసతి : డీఎస్పీ

ట్రెండింగ్‌

Advertisement