e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home వనపర్తి రైతు బాంధవుడికి క్షీరాభిషేకం

రైతు బాంధవుడికి క్షీరాభిషేకం

రైతు బాంధవుడికి క్షీరాభిషేకం

మదనాపురం, జూన్‌ 15 : వానకాలం పంట పెట్టుబడులకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ రైతుల బ్యాంకు ఖాతాలో ఎకరాకు రూ.5వేల చొప్పున జమచేయడం సంతోషంగా ఉందని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ హనుమాన్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు కొన్నూరు గ్రామంలో రైతువేదిక భవనం ఆవరణలో హనుమాన్‌ రావు ఆధ్వర్యంలో ఎంపీపీ పద్మావతి సమక్షంలో రైతులు సీఎం కేసీఆర్‌, వ్యవపాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబాలకు ఆత్మబంధువు అయ్యాడని అభివర్ణించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌నారాయణ, సర్పంచ్‌ రాంనారాయణ, మాజీ సర్పంచ్‌ శివకేశవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సీడీసీ డైరెక్టర్‌ బాలకృష్ణ, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్‌ రంగన్న యాదవ్‌, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, డైరెక్టర్లు నాగేంద్రం, మురళి, కోఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, మార్కెట్‌ డైరెక్టర్లు వెంకటేశ్‌ యాదవ్‌, తిరుపతయ్య, నాయకులు వాసురెడ్డి, అచ్యుతారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పెంటయ్య, మహేశ్‌, మనోజ్‌కుమార్‌, కృష్ణ, ధర్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
వానకాలం పంట పెట్టుబడికి రైతుబంధు డబ్బులు రానే వచ్చాయి. రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో రైతు వేదిక భవనాల వద్ద సీఎం కేసీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పొల్కెపహాడ్‌లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి పాల్గొని సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు బాలరాజు, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ మతీన్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, రైతుబంధు గ్రామ అధ్యక్షులు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

పెబ్బేరు మండలంలో..
మండలంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. రైతుబంధు పథకం ద్వారా రైతు ఖాతాల్లోకి పెట్టుబడి నగదు జమ అయిన శుభ సందర్భాంగా ఆయా రైతువేదిక భవనాల వద్ద నాయకులు సంబురాలు జరుపుకున్నా రు. సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సూగూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాములు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

వీపనగండ్లలో..
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ఎదుట సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్‌, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, విండో డైరెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ కురుమయ్య, నాయకులు రైతులు పాల్గొన్నారు.

శ్రీరంగాపూర్‌లో..
శ్రీరంగాపూర్‌, జూన్‌ 15 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గౌడ్‌నాయక్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు పృథ్వీరాజు, వెంకటస్వామి, కురుముర్తి, మహేశ్‌గౌడ్‌, సంపత్‌ నాయుడు, రమేశ్‌ పాల్గొన్నారు.

రైతు అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
రాష్ట్రంలో ఉన్న రైతుల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులను జమచేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా పామిరెడ్డిపల్లి గ్రామంలో రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డిల చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు సేనాపతి, పుల్లయ్య, రాంచంద్రయ్య, రైతులు పురుషోత్తంరెడ్డి, ఆశిరెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.

వనపర్తి మండలంలో..
మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు రైతులు, కర్షకులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా నాగవరం శివారులో గల రైతువేదిక భవనం వద్ద పలువురు నాయకులు, రైతులు, అలాగే నాగమ్మతండా శివారులో గల రైతుల వ్యవసాయ భూములలో గిరిజన మహిళలు రైతుబంధు డబ్బులు ముందస్తుగా ఈ ఏడాది రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, నాగవరం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, రాజనగరం సహకార సం ఘం చైర్మన్‌ విజయ్‌కుమార్‌, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సింహ, నాయకులు సుదర్శన్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, రాములు, రైతులు పాల్గొన్నారు.

చిన్నంబావిలో..
రైతులకు రైతుబంధు సాయం విడుదల చేసిన సందర్భంగా మంగళవారం చిన్నంబావి కూడలిలో కొప్పునూరు విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, సర్పంచులు గోవిందు, శ్రీధర్‌రెడ్డి, నందికౌసల్యారెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతు బాంధవుడికి క్షీరాభిషేకం
రైతు బాంధవుడికి క్షీరాభిషేకం
రైతు బాంధవుడికి క్షీరాభిషేకం

ట్రెండింగ్‌

Advertisement