e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు తెలంగాణలోనేధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలోనేధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలోనేధాన్యం కొనుగోళ్లు

అన్ని రాష్ర్టాలు చేతులెత్తేశాయి
మిల్లర్లు అధికారులు చెప్పిందే వినాలి
కాలువల పూడికతీత పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫెరెన్స్‌

వనపర్తి, మే 15 : కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు కొనుగోళ్లు విషయంలో చేతులెత్తేశాయని.. ధాన్యం కొం టున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రె డ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొ నుగోళ్ల తరలింపుపై జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధుల తో శనివారం హైదరాబాద్‌లోని మంత్రు ల నివాస సముదాయం నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడా రు. దేశ వ్యాప్తంగా వస్తున్న దిగుబడిలో సగానికి పైగా ధాన్యం తెలంగాణ నుంచి వస్తుందని, మిల్లర్లు అధికారులు చెప్పింది వినాలని మంత్రి సూచించారు. రైతు క ల్లం కాడికి వస్తే ఇంత ధాన్యం ప్రేమతో పె డతాడని, కానీ తూకం వేసిన తరువాత అన్యాయంగా కట్‌ చేస్తే ఏ మాత్రం ఒప్పుకోడన్నారు. తూకం వేసిన తరువాత మళ్లీ తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎవరైనా మిల్లర్లు తరుగు తీస్తే మి ల్లుల లైసెన్స్‌లు నిర్మొహమాటంగా రద్దు చేయాలని మంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న రైతు వేదికలు, గోదాంల ను వినియోగించుకోవాలని, ధాన్యం కొ నుగోళ్ల తరలింపులో జాప్యం జరగకుం డా చూడాలన్నారు. రవాణా సరఫరా కో సం కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు దానికి త గిన వాహనాలను ఏర్పాటు చేయాలన్నా రు. అందుబాటులో ఉన్న వాహనాలతో రవాణా చేసి దాని బిల్లులు ఏజెన్సీల నుం చి చెల్లించాలని, రైతులు కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
కాలువల పూడికతీత పూర్తి చేయాలి..
ఉపాధి హామీలో భాగంగా కాలువల పూడికతీత పనులు వెంటనే పూర్తి చేయాలని, మరో 15 రోజులు మాత్రమే సమ యం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కాల్వల పూడికతీత, పారిశుధ్య పనులపై జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఉన్నతాధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పనులు జ రగడం లేదని, ప్రతి ఒక్క చిన్న, పెద్ద కాలువల పూడికతీత కచ్చితంగా చేపట్టాలన్నారు. ఉపాధి హామీని అనుసంధా నం చేసి రాష్ట్ర ప్రభుత్వం కాల్వల పూడికతీత పనులు చేయిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నా రు. ఫీడర్‌ ఛానళ్లను మొదటి ప్రాధాన్యత కింద గుర్తించి పనులు చేయించాలని, గ్రామాల్లో పారిశుధ్య పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. వానకాలం మొదలైతే పల్లె ప్రగతి పనులు సాగవని, ఇప్పుడే గ్రామాలను శుభ్రం చేసుకుంటే డెంగీ, మలేరియా, సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. సమావేశం లో పౌరసరఫరాల శాఖ డీఏవో, డీసీవో, జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీపీలు, జె డ్పీటీసీలు, పీఏసీసీఎస్‌ అధ్యక్షులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మిల్లర్లు, ట్రా న్స్‌పోర్టు ఏజెన్సీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలోనేధాన్యం కొనుగోళ్లు

ట్రెండింగ్‌

Advertisement