e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు అన్నివర్గాలకు సర్కారు చేయూత

అన్నివర్గాలకు సర్కారు చేయూత

అన్నివర్గాలకు సర్కారు చేయూత

మూసాపేట, మే 12 : ప్రభుత్వం అన్నీ వర్గాల వారికి చేయూతనందిస్తున్నట్లు ఎంపీపీ గూపని కళావతీకొండయ్య సూచించారు. మండల కేంద్రంలోని మసీద్‌ వద్ద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్‌ పండుగకు ఉచితంగా సరఫరా చేస్తున్న దస్తులను బుధవారం ఎంపీపీ అందజేశారు. కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి శేఖర్‌, నాయకులు కొండయ్య, ఖలీం, ఖాధర్‌, శరత్‌, రాము ఉన్నారు.
ముస్లింల అభ్యున్నతికి కృషి
మహబూబ్‌నగర్‌టౌన్‌, మే 12 : ము స్లింల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు అన్నారు. బుధవారం 2వ వా ర్డు ఏనుగొండలో పేద ముస్లింకు రంజాన్‌ దుస్తులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్క డా లేని విధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు, మెరుగైన విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుంతుందన్నారు. అదేవిధంగా ఎదిర 4వ వార్డులో ముస్లింలకు రంజాన్‌ దుస్తులను కౌన్సిలర్‌ యాదమ్మ అందజేశారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్‌హకీం, నాయకులు హన్మంతు, తాటకొండ రాము లు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
అందరి సంక్షేమమే ధ్యేయం
భూత్పూర్‌, మే 12 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం తాసిల్దార్‌ కార్యాలయంలో రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు దుస్తులను పంపి ణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మ న్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, తాసిల్దార్‌ చెన్నకిష్టన్న, సింగిల్‌విండో చైర్మన్‌ కదిరె అశోక్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేశ్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యులు ఖాజా, అజీజ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ సత్తూర్‌నారాయణగౌడ్‌, రైతుబంధు మండ ల అధ్యక్షుడు నర్సింహగౌడ్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మే 12 : మండలంలోని పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్‌ దుస్తులను బుధవారం ఎంపీపీ శశికళాభీంరెడ్డి తాసిల్దార్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మల్లయ్య, వైస్‌ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్‌, తాసిల్దార్‌ ప్రకాశ్‌, కోఆప్షన్‌ సభ్యుడు టీవీఖాజా, స ర్పంచ్‌ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకు లు పాలనాగయ్య, నాజీమ్‌ పాల్గొన్నారు.
రాజాపూర్‌ మండలంలో..
రాజాపూర్‌, మే 12 : ముస్లిం మైనార్టీలు రంజాన్‌ పండుగను సంతోషంగా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్‌ కిట్లను బుధవారం ఖానాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ యాదమ్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ముస్లింలకు అందజేశారు. కార్యక్రమంలో శేఖర్‌గౌడ్‌, ముస్తఫా, వెంకట్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, చెన్నయ్య, షబ్బీర్‌, ఇబ్రహీం పాల్గొన్నారు.
పెద్దాయపల్లి గ్రామంలో..
బాలానగర్‌, మే 12 : మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో బుధవారం సర్పం చ్‌ మెడికల్‌ శంకర్‌ ముస్లింలకు రంజాన్‌ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్‌, వార్డు సభ్యులు ఉన్నారు.
మిడ్జిల్‌ మండలంలో..
మిడ్జిల్‌, మే 12 : ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు శ్రీనివాసులు అన్నా రు. బుధవారం మండలంలోని వాడ్యాల్‌ గ్రామంలో రంజాన్‌ సందర్భంగా ముస్లింల కు దుస్తులు పపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, సుకుమార్‌, వెంకటయ్య, నరసింహ, మల్లేశ్‌, ముస్లింలు నా యకులు తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నివర్గాలకు సర్కారు చేయూత

ట్రెండింగ్‌

Advertisement