e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు బాదేపల్లి సీహెచ్‌సీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

బాదేపల్లి సీహెచ్‌సీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

బాదేపల్లి సీహెచ్‌సీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

పేదలకు మెరుగైన వైద్యం
ప్లాంట్‌ ఏర్పాటుకు కంపెనీలు ముందుకురావడం అభినందనీయం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల, జూన్‌ 4 : జడ్చర్లలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో బాదేపల్లి కమ్యూనిటీ దవాఖానలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సీఎస్సార్పీలో భాగంగా విర్కో పెట్రో కెమికల్స్‌ కంపెనీ వారు బాదేపల్లి దవాఖానలో రూ.60లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌తోపాటు, కొవిడ్‌ వార్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నా రు. కరోనా బాధితులకు జడ్చర్లలోనే మెరుగైన వైద్యం అందించేందుకు 20 ఆక్సిజన్‌బెడ్లతో కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఇందుకు విర్కోపెట్రో కెమికల్స్‌ కంపెనీవారు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రజలు అజాగ్రత్త వహించొద్దని సూచించా రు. కాగా, జడ్చర్లలో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ వార్డులో ఢిల్లీ కేర్‌ ఇండియా మేనేజర్‌ భవానీశంకర్‌, డాక్టర్‌ సోయబ్‌అలీ ఖురేషి, డాక్టర్‌ తాషిఫ్‌ఖురేషి వైద్యసేవలు అందించనున్నారు. కార్యక్రమంలో సంగీ త, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్‌ చై ర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌చైర్మన్‌ సారిక, తాసిల్దార్‌ లక్ష్మీనారాయణ, దవాఖాన సూపరింటెండెంట్‌ సోమశేఖర్‌, వైద్యులు శివకాంత్‌, రాఘవేందర్‌, భాస్కర్‌నాయక్‌, కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్‌, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రమే శ్‌, లత, చైతన్య, బృందంగోపాల్‌, మాజీ చైర్మన్‌ ముర ళి, రామ్మోహన్‌, కొండల్‌, ఇఫ్తేకారొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాదేపల్లి సీహెచ్‌సీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

ట్రెండింగ్‌

Advertisement