కొత్తకోట, మే 8: అంతర్జాతీయ అవార్డును కొత్తకోట పట్టణానికి చెందిన ఎస్ఆర్ ప్రేమయ్య శనివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పీ రాములు చేతుల మీదుగా అందుకున్నారు. ఇంటర్ నేషనల్ వరల్డ్ బుక్ఆఫ్ రికార్డులో 129 దేశాలు కలిపి ఈ అవార్డును ఎంపిక చేయనున్నారు. సామాజిక సేవ, వైద్యం, విద్యారంగం, ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం ఒకరిని ఎంపిక చేసి అవార్డును అందజేస్తారు. 30ఏండ్ల కిందట ఉమ్మడి జిల్లాలో వైద్య రంగంలో సేవలందించడంతోపాటు రిక్షా, హమాలీ కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడంతోపాటు ఆధ్యాత్మిక రంగంలో ఉమ్మడి జిల్లాలోని ధ్యానరత్న అవార్డు అందుకున్నందుకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు సుధాకర్, నరేందర్‌గౌడ్, ఆంజనేయరాజు, సాక వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.