e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home వనపర్తి VEEPANGANDLA: కులవృత్తులకు ప్రాణం పోస్తున్న కేసీఆర్: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

VEEPANGANDLA: కులవృత్తులకు ప్రాణం పోస్తున్న కేసీఆర్: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపనగండ్ల: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రాణం పోస్తూ అనేక మందికి జీవనాధారం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోపల్‌దిన్నే రిజర్వాయర్‌లో 3లక్షల 60 వేల చేప పిల్లలను జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.

స్థానిక టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి గోపల్‌దిన్నే రిజర్వాయర్‌లో బోట్ విహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ..తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తలపించే విధంగా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మత్స్య సంపద పెంపొందించడం ద్వారా మత్సకారులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -


ఐస్ యూనిట్, ఫ్యాకింగ్ యూనిట్ ద్వారా మత్స్యకారులకు పడవలు, వలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోవర్ధనగిరి గ్రామంలో రూ.10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు డ్రైనేజీ కాలవల నిర్మాణానికి భూమి చేశా రు. గోపల్‌దిన్నే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎచ్. శ్రీనివాస్ రావుకు మంజూరైన రూ.52 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేశారు.

మండలంలో నూతనంగా ఎంపికైన టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ సభ్యలను శాలువలతో సన్మానించి అభినందించారు. గోపల్‌దిన్నే గ్రామంలో శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ భవన స్థానంలో నూతన నిర్మాణానికి జడ్పీ నిధుల నుంచి రూ.15 లక్షలు చేయనున్నట్లు జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్ రావు, జెడ్పీటీసీ మాధూరి, సింగిల్‌విండో చైర్మన్ రామన్ గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement