సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jun 19, 2020 , 22:13:24

గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకుల అరెస్టు

గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకుల అరెస్టు

వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో బైకుపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి వారినుంచి 56గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి.. పట్టణంలోని టీచర్స్‌కాలనీకి చెందిన భువనగిరి హేమంత్‌, పీర్లగుట్టకు చెందిన ముంత లోకేశ్‌ నాయుడు డిగ్రీ చదువుతున్నారు. గంజాయికి బానిసలై కోల్లాపూర్‌ వద్ద అమరగిరి వెళ్లి కొనుగోలు చేసి తీసుకువస్తుండగా వనసర్తి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద పోలీసులు బైకును నిలిపి తనిఖీ చేయగా సీట్‌ కవర్లలో గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్‌గౌడ్‌ తెలిపారు.