అమడబాకుల అదుర్స్

- పల్లె ప్రగతితో మారిన గ్రామ స్వరూపం
- సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఊరంతా పచ్చని చెట్లు.. ఆహ్లాదం నింపేట్లు..
- పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
- సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఊరంతా పచ్చని చెట్లు..ఆహ్లాదం నింపేట్లు..
ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పల్లె ప్రగతితో పరిష్కారం దొరుకుతున్నది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల అభివృద్ధిలో అదుర్స్ అనిపించుకుంటున్నది. పల్లె ప్రగతిలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 24పనులను గుర్తించడమే కాకుండా వాటికి పరిష్కారం చూపించింది. రైతు వేదిక, ప్రతి వీధిలో ఎల్ఈడీ వెలుగులు, ఆహ్లాదకరమైన పార్కు, నూతన డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్డు, శ్మశాన వాటిక, మోడల్ నర్సరీ ఏర్పాటైంది. ఎటు చూసినా ఊరంతా పచ్చని అందాలతో స్వాగతం పలుకుతూ ఆదర్శంగా నిలిచింది.
వనపర్తి/కొత్తకోట, ఫిబ్రవరి 22 : టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నది. అందులో భాగంగానే ఎక్కడా లేని వి ధంగా పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేశారు. మరుగునపడ్డ గ్రామాలు పల్లెప్రగతితో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాయి. కొత్త
కోట పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల లోపలికి ఉన్న అమడబాకుల గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లెప్రగతి ద్వారా గ్రామంలోని సమస్యలు పరిష్కారమయ్యాయి. మోడల్ నర్సరీని ఏర్పా టు చేశారు. రహదారికిరువైపులా పచ్చని పంట పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం లో గ్రామస్తులు తమ పనులు చేసుకుంటున్నా రు. పల్లెప్రగతి ద్వారా గ్రామంలో పెండింగ్‌లో ఉన్న 24 పనులను గుర్తించి, వాటిని పూర్తి చేశా రు. గ్రామంలో రైతువేదిక, ప్రతి వీధిలో ఎల్ఈడీ వెలుగులు, ఆహ్లాదకరమైన పార్కు, నూతన డ్రైనే జీల నిర్మాణం, సీసీ రోడ్లు వంటి సౌకర్యాలు క ల్పించుకున్నారు. ఇంటింటికీ సేకరించిన చెత్తతో ఎరువు తయారుచేస్తున్నారు. మోడల్ నర్సరీని ద్వారా పక్క గ్రామాలకు మొక్కలు అందిస్తున్నారు.
సమస్యలు పరిష్కారం..
పల్లెప్రగతితో ఏండ్లుగా పెం డింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఈ కా ర్యక్రమం ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటు న్నాం. ఇది ఒక సువర్ణ అవకా శం. రైతువేదిక, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం, నూతన డ్రైనేజీలు ఏర్పాటు చే సుకున్నాం. హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షించుకుంటున్నాం.
- బుచ్చన్న, సర్పంచ్, అమడబాకుల
వరంలా పల్లెప్రగతి..
గ్రామాలకు పల్లెప్రగతి వరంలా మారింది. అన్ని రకాల సమస్యలను గుర్తించి పరిష్కరించుకున్నాం. ఎన్నో సమస్యల పరిష్కారానికి పునాది. గ్రామానికి కావల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నాం. పల్లెప్రకృతి వనంలో వందలాది మొక్కలు నాటాం. గ్రామంలో ఏండ్ల తరబడి తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించుకున్నాం. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాం.
- మౌనిక, పంచాయతీ కార్యదర్శి, అమడబాకుల
గ్రామం సుందరంగా ఉన్నది..
ఒకప్పుడు పార్కులంటే పట్టణాలే గు ర్తుకొచ్చేవి. సర్కారు చొరవతో పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పుడు గ్రామాల్లో నూ పార్కులు దర్శనమిస్తున్నాయి. మా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉన్నది. గతంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న మా గ్రామాన్ని పల్లె ప్రగతి ద్వారా సుందరంగా తీర్చిదిద్దుకున్నాం.
- నాగరాజు, అమడబాకుల
గ్రామంలో చేపట్టిన ‘ప్రగతి’..
- పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా 25 పనులు గుర్తించగా అన్నింటినీ పూర్తి చేశారు.
- నాలుగు పురాతన పాడుబడిన బావులను పూడ్చివేశారు.
- 25 పాత ఇండ్లు కూల్చివేశారు.
- రూ.22 లక్షలతో రైతువేదిక నిర్మించారు.
- రూ.2.40 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డు నిర్మించి.. రూ.2.10 లక్షలు చెల్లించారు.
- ఎకరా స్థలంలో పల్లెప్రకృతి వనం, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ బేంచీలు, ప్లాంటేషన్‌తోపాటు పార్కుకు వచ్చే వారి కోసం రెండు వైపులా రహదారి ఏర్పాటు చేశారు.
- మోడల్ నర్సరీని ఏర్పాటు చేసి 68 వేల మొక్కలు, 20 రకాల చెట్లను పెంచుతున్నారు. డంపింగ్ యార్డు ద్వారా తయారుచేసిన ఎరువును మొక్కలకు వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు మొక్కలను అందజేస్తున్నారు.
- రూ.14 లక్షలతో గ్రామంలో నూతన డ్రైనేజీలు నిర్మించారు.
- హరితహారంలో భాగంగా గ్రామంలో, రహదారి వెంట, పార్కు లో మొత్తం ఎనిమిది వేల మొక్కలు నాటగా.. అందులో 85 శాతం బతికాయి. వాటిని సర్వేయల్ చేశారు.
- జనాభా ఆధారంగా మూడు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. అందులో 40 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు మిషన్ భగీరథ ట్యాం కులు, ఒకటి గ్రౌండ్ లెవల్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు.
- గ్రామంలో నూతనంగా 100 కరెంట్ స్తంభాలను ఏర్పాటుచేసి. నూతన ఎల్ఈడీ లైట్లు బిగించారు.
- నిలిచిన శ్మశానవాటిక ఆర్చి..
- గ్రామంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో శ్మశానవాటిక పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మొదటి కాంట్రాక్టర్ 70 శాతం పనులు పూర్తి చేసి వదిలేయడంతో మరొకరికి కేటాయించారు. దీం తో పనులు నెమ్మదించాయి. శ్మశానవాటిక ఆర్చి మినహా మిగతా పనులు పూర్తి చేశారు. నెల రోజుల్లోగా ఆర్చి పూర్తి చేస్తామని సర్పంచ్ బుచ్చన్న, పంచాయతి కార్యదర్శి మౌనిక తెలిపారు.
తాజావార్తలు
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో
- ‘ఓటీఎస్’ గడువు పెంచిన ప్రభుత్వం
- ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులు అరెస్టు