ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Wanaparthy - Feb 07, 2021 , 00:28:36

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

  • పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ

అలంపూర్‌, ఫిబ్రవరి 6 : మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ ఆదేశించారు. శనివారం తెల్లవారుజామున ఆమె పారిశుధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. ఎంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. మిగతా వారు ఎందుకు హాజరు కాలేదు అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీ పాత్ర వెలకట్టలేనిదన్నారు. పట్టణంలో అన్ని వీధులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు. కుప్పలుగా వేసిన చెత్త రోడ్లపై అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌ యార్డుకు చేరవేయాలన్నారు. ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలకు ఇచ్చిన వాహనాలను చెత్త తరలించడానికి సద్వినియోగం చేసుకొని చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo