కిచెన్‌లో ఏదో చప్పుడు.. పిల్లేమో అనుకొంది. మళ్లీ శబ్దం.కొంచెం పెద్దగా వినిపించింది. దొంగేమో అనుకొంది. ఈ సారి పల్లేలు.. గిన్నెలు కింద పడుతున్న శబ్దం రావడంతో థాయ్‌ల్యాండ్‌కు చెందిన ప్యూంగ్ప్రాసొప్పన్ అనే మహిళ వంటింట్లోకి వెళ్లి అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. పిల్లి కాదు.. దొంగ కాదు. ఏనుగు ఉంది అక్కడ. ఆహారం కోసం వెతుకుతున్నది. గోడను బద్దలుకొట్టి మరీ ఏనుగు కిచెన్‌లోకి చొరబడింది. ఆ దృశ్యాలను ప్యూంగ్ప్రాసొప్పన్ తన ఫోన్‌తో కెమెరాలో ఇలా బంధించారు.