మంగళవారం 09 మార్చి 2021
Wanaparthy - Jan 27, 2021 , 00:15:33

దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

  • డబుల్‌ బెడ్రూం ఇండ్ల జాబితాలో ప్రాధాన్యత
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • వనపర్తిలో దడవాయి సంఘం ఆత్మీయ సమ్మేళనం

వనపర్తి రూరల్‌, జనవరి26: రాష్ట్రంలోని దడవాయి కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలోని ఆర్‌జీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ దడవాయి సంఘం కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని వసతులతో జిల్లాలో 40ఎకరాల్లో మార్కెట్‌ యార్డు నిర్మాణం చేపడుతామన్నారు. నాబార్డు కింద జిల్లాకు 4కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ గోదాం మంజూరు చేయించామన్నారు. దడవాయి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. దడవాయి కార్మికులకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చేందుకు నాయకులకు సిఫార్సు చేస్తామన్నారు. అంతకుముందు దడవాయి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. కడుకుంట్ల గ్రామం దడవాయి కార్మికులు 70మందికిపైగా మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, దడవాయి సంఘం గౌరవాధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్‌ కురుమూర్తియాదవ్‌, వనపర్తి, పాన్‌గల్‌, పెబ్బేరు మార్కెట్‌ కమిటీల చైర్మన్లు లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,శ్యామల పాల్గొన్నారు.

VIDEOS

logo