Wanaparthy
- Jan 27, 2021 , 00:15:28
VIDEOS
అభివృద్ధిలో దూసుకెళ్తున్న వనపర్తి

- కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
- పాలిటెక్నిక్ కళాశాలలో జెండావిష్కరణ
- హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో వ నపర్తి జిల్లా దూసుకెళ్తుందని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పేర్కొన్నారు. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏ ర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. వివి ధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్, మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నా రు. ఏడాది కాలంలో జిల్లా అధికారు లు సాధించిన ప్రగతిని, అభివృద్ధి పథకాలను వివరించారు.
- రైతుబంధు పథకం ద్వారా వానకాలంలో 1,48426 మందికి రూ.179,09, 60,036 చె ల్లించామని కలెక్టర్ చె ప్పారు. యాసంగిలో 1,42,199 మంది రైతులకు రూ.177,67,74,049 ఖా తాలో జమచేశామన్నారు. 2020-21 లో 248 మంది రైతులు మరణించగా వారిలో 218 మందికి రైతుబీమా ద్వారా రూ.10.90 కోట్లు చెల్లించామన్నారు.
- మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 658 చెరువులు, కుంటల్లో 2.02 కోట్ల చేప పిల్లలను వదిలామన్నారు. సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి పథకం ద్వారా ఐదు చేపల మార్కెట్లు, 12 మత్స్య పారిశ్రామిక సంఘాల భవనాలు మంజూరు చేశామన్నారు.
- గొర్రెల కాపరులకు ఇప్పటివరకు 13,375 యూనిట్లను అందించామన్నారు. 532 పాడి పశువులను పంపిణీ చేసి మూడేండ్ల బీమా కల్పించినట్లు చెప్పారు.
- జూరాల, భీమా, ఎంజీకేఎల్ఐ ద్వారా 1,62,266 ఎకరాలకు వానకాలంలో సాగునీటిని అందించామన్నారు.
- మిషన్ కాకతీయ నాలుగు దశల్లో రూ.124.40 కోట్ల ఖర్చుతో 898 చెరువుల్లో మరమ్మతు పనులు చేపట్టామన్నారు.
- జిల్లాలోని 392 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.300 కోట్లతో పనులు చేపట్టామన్నారు.
- ఫిబ్రవరి 1వ తేదీ మొదలుకొని 9 నుంచి ఆ పై తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు.
- ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.273.19 కోట్లతో వి విధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ. 40.48 కోట్లతో వనపర్తి కలెక్టరేట్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
- జిల్లాకు 3,940 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, వీటిలో 3,332 నిర్మాణంలో ఉండగా.., 608 పూర్తయ్యాయని.., 89 ఇండ్లను లబ్ధిదారులకు అందించామన్నారు.
- 2020-21లో 2,587 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.25.73 కోట్లు అందించామన్నారు.
తాజావార్తలు
- షాకింగ్ : సంతానం కలగలేదని మహిళను కడతేర్చారు!
- ‘ముద్ర’లో తెలంగాణపై కేంద్రం వివక్ష : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
MOST READ
TRENDING