బుధవారం 24 ఫిబ్రవరి 2021
Wanaparthy - Jan 24, 2021 , 00:43:39

చదువు జ్ఞానాన్ని పెంచాలి

చదువు జ్ఞానాన్ని పెంచాలి

  • జిల్లా 9వ అదనపు జడ్జీ శ్రీనివాసులు

వనపర్తి టౌన్‌, జనవరి 23 : చదువు జ్ఞానాన్ని పెంచాలని, ఆదర్శ జీవితంతోనే నేరాల నియంత్రణ జరుగుతుందని జిల్లా 9వ అదనపు జడ్జీ శ్రీనివాసులు అన్నారు. శనివారం గాయత్రీ వృత్తివిద్య కళాశాలలో న్యాయసదస్సు, జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చదువు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. మార్పు అనేది మననుంచే మొదలు కావాలని మంచి స్నేహితులు, మంచి గురువు, మంచి పుస్తకంతోనే ఆదర్శ జీవితం లభిస్తుందని సూచించారు. నేరరహిత సమాజం కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అన్నారు. సదస్సులో న్యాయవాదులు మోహన్‌కుమార్‌, పుష్పలత, కృష్ణయ్య, జయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌, మోహన్‌, రజినీదేవి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo