Wanaparthy
- Jan 24, 2021 , 00:43:55
VIDEOS
వర్టికల్స్ సమర్థ అమలుపై శిక్షణ

వనపర్తి, జనవరి 23 : తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 15 రకాల వర్టికల్స్‌ను సమర్థవంతంగా అమలయ్యే విధంగా చూడాలని ఎస్పీ అపూర్వరావు అన్ని స్థాయిల పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ని సమావేశ భవనంలో నిర్వహించిన ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో ఆమె పోలీస్ స్టేషన్ల వారీ గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వర్టికల్స్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్లో నమోదులో రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమన్నారు. పోలీస్ శాఖ అమలు చేస్తున్న 15 ర కాల వర్టికల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ధ వహించి సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్‌కు విధిగా స్పందించాలన్నారు. సమావేశం లో రిసెప్షన్లు, బ్లూకోట్స్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING