సోమవారం 08 మార్చి 2021
Wanaparthy - Jan 22, 2021 , 01:15:16

పాఠశాల ప్రారంభానికి సంసిద్ధులు కావాలి

పాఠశాల ప్రారంభానికి సంసిద్ధులు కావాలి

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి సంసిద్ధులు కావాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో పాఠశాలల ప్రారంభం విషయమై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం దృష్ట్యా ఈనెల 25 నాటికి అన్ని పాఠశాలల్లో మొదటి విడుత శానిటైజేషన్‌ పూర్తి చేయాలని, అలాగే ప్రతి పాఠశాలలో మాస్కుల పంపిణీకి చర్య లు తీసుకోవాలని చెప్పారు. శానిటైజేషన్‌ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్‌, విద్యాకమిటీ చైర్మన్‌గా ఉంటారని తెలిపారు. ప్రతి తరగతిలో 25 మంది విద్యార్థులు మాత్రమే ఉం డాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కేవలం 9, 10 తరగతులకు మాత్రమే హాస్టళ్లు నిర్వహించాలని, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు డిమాండ్‌ చేయకూడదన్నారు. సమావేశంలో డీఈవో సుశీందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌ పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌, జనవరి 21 : విద్యార్థుల విద్యాబోధనను  దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరలో ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని 11 ఉ న్నత పాఠశాలను శుభ్రం చేయడం, సోడియం హైపోక్లోరైట్‌ ద్రా వణాన్ని పిచికారీ చేయించారు. మండలకేంద్రంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. 

VIDEOS

logo