ఆదివారం 07 మార్చి 2021
Wanaparthy - Jan 19, 2021 , 02:06:35

ఆన్‌లైన్‌లో యోగా

 ఆన్‌లైన్‌లో యోగా

  • సంపూర్ణ ఆరోగ్యం.. ఏకాగ్రత కోసమే..
  • ఉచిత క్లాస్‌లకు సుబ్రహ్మణ్యశర్మ శ్రీకారం
  • ప్రచార మాధ్యమాల ద్వారా దేశ విదేశాల్లో..
  • ఇప్పటికే 4,250 మంది సద్వినియోగం 
  • ప్రయోజనమంటున్న యోగా సాధకులు

 ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రముఖ యోగా గురువు శ్రీకొండా సుబ్రహ్మణ్యశర్మ కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను ఉపయోగించుకొని పలువురికి ఆన్‌లైన్‌లో ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తున్నారు. జూమ్‌ యాప్‌, ఫేస్‌బుక్‌తోపాటు సుమారు 40 వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి యోగా, ప్రాణాయామం, ఏకాగ్రత తదితర అంశాలపై క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, ఏపీ, దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలకు చెందిన సుమారు 4,250 మంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. 

వనపర్తి, జనవరి 18 : ఆధునిక యుగంలో యోగా సాధనను మరుస్తున్నారు. ఆరోగ్యంపై అ శ్రద్ధ వహిస్తున్నారు. సమయానికి తిండితినక ఎ న్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా ప్రజలకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపేలా చేసిం ది. ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించేలా చేసింది. యోగా వైపు అందరి దృష్టి మళ్లింది. చాలా మం ది ఆన్‌లైన్‌లో యోగా నేర్చుకుంటున్నారు. అ యితే, అందుబాటులో ఉన్న సాంకేతిక వనరుల ను ఉపయోగించుకొని పలువురికి ఆన్‌లైన్‌లో ఉచితంగా శిక్షణనిస్తూ ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా గురువు సుబ్రహ్మణ్యశర్మ కృషి చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దేశంలోని వివి ధ ప్రాంతాలు, విదేశాలకు చెందిన సుమారు 4,250 మందికి శిక్షణ ఇస్తున్నారు. 40 వాట్సా ప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి జూమ్‌ యాప్‌, ఫేస్‌బుక్‌ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా యో గా, ప్రాణాయామం, ఏకాగ్రత తదితర అంశాలపై ట్రైనింగ్‌ ఇస్తున్నారు. 

ఉచిత ఆన్‌లైన్‌ సేవలు ఇలా..

కర్నూల్‌ జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యశర్మ (పతాంజలి యోగా సమితి మహారాష్ట్ర సభ్యుడు) బీకాం పూర్తి చేశారు. స్టాఫ్‌ సెలక్షన్‌ రిక్రూట్‌మెం ట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అకౌంట్స్‌ విభాగంలో కొలువు సంపాదించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ నే.. మరోవైపు యోగా, ప్రాణాయామంపై దృష్టి సారించారు. ఇందు లో పట్టు సాధించిన ఆయన మహారాష్ట్రలో 2003 నుంచి ఉచితంగా తరగతులు నిర్వహిస్తున్నారు. తెలు గు, మరాఠి, ఆంగ్లం, హిందీ భాష ల్లో అవగాహన కల్పిస్తూ ఉచిత యోగా శిక్షణకు శ్రీకారం చుట్టారు. మే నెలలో మహారాష్ట్రలో 70 మం ది సభ్యులతో ఉచిత ఆన్‌లైన్‌ యో గా, ప్రాణాయామం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. 15 రోజులకో బ్యాచ్‌ చొ ప్పున ప్రారంభిస్తూ ప్రతి రోజూ ఉదయం 5:30 నుంచి 7:30 వర కు అవగాహన కల్పిస్తున్నారు. యో గా, ప్రాణాయామం వల్ల రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌, వెన్నునొప్పి, మలబద్ధకం, ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఆస్తమా, ఆర్థారైటిస్‌ తదితర వ్యాధులను తగ్గించుకోవచ్చని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి యోగా దోహడపడుతుంద ని వివరిస్తున్నారు. ఆ సక్తి ఉన్న వారు 9966410040, 970110 0981 వాట్సాప్‌ నెంబర్లను సంప్రదించాలని ఉ చిత యోగా నిర్వహణ వనప ర్తి శాఖ ప్రతినిధి వినయ్‌కుమార్‌ 

షార్జా నుంచి యోగా సాధన..

నాకు ఎనిమిదేండ్లు. యూఏఈలో ఉన్న షార్జా పట్టణంలో నివాసం ఉంటున్నాను. వాట్సాప్‌ మెస్సేజ్‌లో ఉన్న ఉచిత యోగా సాధన అంశం చూశా. అందులో ఇచ్చిన సమయానికి లింక్‌ ఓపెన్‌ చేసి చూశాను. ఆసక్తిగా ఉండడంతో ఉచిత యోగా సాధన చేస్తున్నాను. మేథోసంపత్తితోపాటు ఏకాగ్రత పెరిగింది. భారత కాలమాణం ప్రకారం ఉదయం 5:30 గంటలకు యోగా సాధన చేస్తున్నాను.

- కావ్య, షార్జా డస్ట్‌ అలర్జీ తగ్గింది.. 

డస్ట్‌ అలర్జీతో చాలా ఏండ్లుగా బాధపడుతున్నా. ఆన్‌లైన్‌ యోగా గురించి చాలా మంది చెప్పారు. మొదటగా అంత ఆసక్తి లేకపోయి నా.., రెండు, మూడు సార్లు ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొన్నాను. మంచిగా అనిపించింది. ఆచరించాలనే లక్ష్యం ఏర్పడింది. మూడు నెలలుగా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నా. ప్రస్తుతం డస్ట్‌ అలర్జీ తగ్గి ఆరోగ్యంగా ఉన్నాను.   - గిరిజాదేవి, ప్రైవేట్‌ టీచర్‌, వనపర్తి 

బరువు తగ్గాను.. 

వనపర్తిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. అధిక బరువుతో బాధపడేవాడిని. నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ ఉచిత యోగా ఆచరిస్తున్నాను. నాలుగు కిలోల బరువు తగ్గాను. యోగా, ప్రాణాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆచరిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

- వినయ్‌కుమార్‌, ఉచిత యోగా నిర్వహణ వనపర్తి శాఖ ప్రతినిధి

సంపూర్ణ ఆరోగ్యం కోసం..

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా యోగా శిక్షణకు పూనుకున్నాను. రెండు దశాబ్దాలుగా ప్రాణాయా మం, యోగా, ధ్యానంపై శిక్షణ ఇ స్తున్నాను. కరోనా నేపథ్యంలో ఆ న్‌లైన్‌లో శిక్షణకు ఉపక్రమించా. తెలుగు రాష్ర్టాలతోపాటు పలు దే శాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అన్ని అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. 

- సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ యోగా గురువు


VIDEOS

logo