మంగళవారం 02 మార్చి 2021
Wanaparthy - Jan 17, 2021 , 01:24:49

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీబస్సు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీబస్సు

  • ఒకరి మృతి, మరో పది మందికి గాయాలు

కొత్తకోట, జనవరి 16 : డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మినీ బస్సు ఢీకొట్టిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి గాయాలు అయ్యాయి. ఎస్సై నాగశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్‌లోని చిక్కడ్‌పల్లికి చెందిన విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 13న మినీబస్సు (ఏపీ29వీ7864)లో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న మినీబస్సు శనివారం తెల్లవారు జామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం జాతీయ రహదారి 44పై ఆగి ఉన్న లారీని వెనుక బలంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న 11 మందిలో స్వరూప (45)అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. విశ్వనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మినీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కొత్తకోట, జనవరి 16 : మండలంలోని అమడబాకుల స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఎస్సై నాగశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం మండలంలోని రామానంతాపురం గ్రామానికి చెందిన మీనిగడ్డ మహేశ్‌(25)అత్తగారి ఊరైన బూత్కూర్‌కు బైక్‌పై వెళ్తుండగా అమడబాకుల స్టేజి సమీపంలో ఎన్‌హెచ్‌44పై యూటర్న్‌ తీసుకునే క్రమంలో హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్‌ను 108లో కొత్తకోట దవాఖానకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య శశికళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

VIDEOS

logo