గురువారం 04 మార్చి 2021
Wanaparthy - Jan 17, 2021 , 01:24:41

క్రీడల సముదాయ నిర్మాణానికి కృషి

క్రీడల సముదాయ నిర్మాణానికి కృషి

  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి గాంధీచౌక్‌, జనవరి 16 : సమగ్ర సమీకృత క్రీడల సముదాయ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈనె ల 13 నుంచి 16వ తేదీ వరకు వనపర్తి జిల్లా క్రికె ట్‌ సంఘం ఆధ్వర్యంలో సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలను నిర్వహించారు. శనివారం పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మం త్రి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, ఆటలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడలు ఉపయోగపడితే ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం మెం డుగా ఉంటుందన్నారు. పోటీల్లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు రూ.లక్ష నగదుతో పాటు ట్రోఫీని, రన్నర్‌గా నిలిచిన రాయిచూర్‌ జట్టుకు రూ.50వేలతో పాటు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్‌ లక్ష్మయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, నాయకులు కరుమయ్య, బీచుపల్లి, శశిభూషణ్‌ పాల్గొన్నారు.

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌, జనవరి 16 : మండలంలోని కేతేపల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన అంతర్‌ రాష్ట్ర వాలీబాల్‌ క్రీడాపోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు శనివారం పీపీసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌ నగదు బహుమతులు అందజేశారు. వాలీబాల్‌ క్రీడలో మొదటి బహుమతి సాధించిన మంగళూరు జట్టుకు రూ. 30 వేలు, రెండో బహుమతి సాధించిన కర్ణాటక జట్టుకు రూ. 20 వేలు, మూడో బహుమతి సాధించిన ముంబాయి జట్టుకు  రూ. 10వేలు అందజేశారు.

VIDEOS

logo