శుక్రవారం 05 మార్చి 2021
Wanaparthy - Jan 17, 2021 , 00:39:13

వ్యాక్సిన్‌ వరంలాంటిది..

వ్యాక్సిన్‌ వరంలాంటిది..

  • వనపర్తి జిల్లా దవాఖానలో టీకా పంపిణీలో మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఓ వరం లాంటిదని, టీకా తయారీకి శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎనలేనిదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. శనివారం వనపర్తి జిల్లా దవాఖానలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, డీఎంహెచ్‌వో శ్రీనివాసులుతో కలిసి టీకా పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని టీవీ లో వీక్షించారు. టీకా వేయించుకునే వారి వివరాలు పరిశీలించి.. వ్యాక్సిన్‌ వేసిన తరువాత 30 నిమిషాల పా టు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోగలిగే శక్తి మానవ మేథస్సుకు ఉందన్నారు. దశల వారీగా వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రభు త్వం చాలా నిశితమైన పరిశీలనతో ఉందని వివరంచారు. జిల్లా దవాఖానలో తొలి టీకా వేసిన స్టాఫ్‌ నర్సు తిరుపతమ్మను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మ న్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, దవాఖాన సిబ్బంది ఉన్నారు.

నాలుగు కేంద్రాల్లో టీకా..

జిల్లా దవాఖాన, ఆత్మకూరు, రేవల్లి, ఖిల్లాఘనపురం దవాఖానల్లో వ్యాక్సిన్‌ వేశారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున మొత్తం 120 మందికి తొలిరోజు టీకా వేశారు. 


VIDEOS

logo