శనివారం 06 మార్చి 2021
Wanaparthy - Jan 14, 2021 , 00:35:03

ఊరూరా ‘భోగి’భాగ్యాలు

ఊరూరా ‘భోగి’భాగ్యాలు

వనపర్తి/ఆత్మకూరు/వీపనగండ్ల/చిన్నంబావి/రేవల్లి /కొత్తకోట, జనవరి 13: జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. భోగి సందర్భంగా బుధవారం మహిళలు తెల్లవారుజామున 4 గంటలకే ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేసి గొబ్బెమ్మలు పెట్టా రు.   భోగి మంటలు వేసి  సూర్యుడికి ఇష్టమైన వంటకాలను సిద్ధంచేసి నైవేద్యంగా సమర్పించా రు. పిల్లలు, యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ సరదాగా పండుగ జరుపుకొన్నారు. కొత్త ధాన్యం ఇంటికి చేరడంతో రైతులు సంతోషంగా పడుగను నిర్వహించుకున్నారు.  నువ్వులతో కలిపిన జొన్న రొట్టెలు, చిక్కుడు కాయ కూర, పిండి పదార్థాలను వండుకొని తినడం భోగి పండుగ ప్రత్యేకత. సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రజాప్రతినిధులు, నాయకులు మండల ప్రజలకు సంక్రాంతి పండు గ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దమరూరు గ్రామం లో ఎంపీపీ సోమేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారం కొనసాగాయి. పెద్దదగడ గ్రామంలో భోగిపండుగ సందర్భంగా గ్రామస్తులు ఆలయంలో గోదాదేవి కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయాలకు వెళ్లి  పూజలు చేశారు. రేవల్లి మండలం కేశంపేట గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గోపాలాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. కొత్తకోట చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామున భోగి మంట లు వేశారు.  తెలంగాణ జాగృతి  జిల్లా అధ్యక్షుడు చీర్లసత్యంసాగర్‌ సూచన మేరకు జిల్లా కన్వీనర్‌ విజయ్‌ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రాములుయాదవ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుపతి, హన్మంత్‌యాదవ్‌, కోఆప్షన్‌ సభ్యులు వసీంఖాన్‌, బొర్ర కృష్ణయ్య, వినోద్‌సాగర్‌ టీజీ మహేశ్‌, రాంచంద్రయ్య, కురుమయ్య, నవీన్‌, అరవింద్‌, వికాస్‌, చింటూ, శివ, రఘు, రాజు తదితరులు ఉన్నారు.

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం

వనపర్తి, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని 13వ , 22వ వార్డులో కౌన్సిలర్లు పుట్టపాకు ల మహేశ్‌, చీర్ల సత్యం  ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్‌ గట్టుయాదవ్‌ ప్రారంభించారు.  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమానికి ఆయన, జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో ఏర్పా టు చేసిన భోగి మంటల కార్యక్రమానికి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ హాజరయ్యారు. అనంతరం 22వ వార్డుకు చెందిన ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి చంద్రకళ, ద్వితీ య బహుమతి పింకీ, తృతీయ బహుమతి సుకన్య, 13వ వార్డులో మొదటి బహుమతి కాత్యాయని, ద్వితీయ బహుమతి లిఖిత, తృతీయ బహుమతి మనుశ్రీకి  మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ పుట్టపాకుల పార్వతమ్మ అందజేశారు.

VIDEOS

logo