మంగళవారం 09 మార్చి 2021
Wanaparthy - Jan 14, 2021 , 00:35:02

భాషాభివృద్ధికి కృషి చేయాలి

భాషాభివృద్ధికి కృషి చేయాలి

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • పుస్తకాలు ఆవిష్కరణ.. సాహితీవేత్తలు, కవులకు సన్మానం
  • సింగిరెడ్డి తారకమ్మ జ్ఞాపకార్థం క్రికెట్‌ పోటీలు ప్రారంభం

వనపర్తి, జనవరి 13 : సాహిత్యం, భాషా మీద పట్టు కొత్త తరాల వారికి లోపిస్తుందని, భాషా, సాహిత్యాభివృద్ధికి కవులు, సాహితీవేత్తలు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సూచించారు. బు ధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భాషా, కవి పండితులు రచించిన కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ సాహిత్యంలో సరళ కవిత్వం తో పాటు పద్య కవిత్వం పెరిగేలా సాహితీవేత్తలు ముందుకు సాగాలని కోరారు. సంక్రాం తి అంటేనే కీడు పండుగని మన పెద్దవాళ్లు అ నేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత కీడు పండుగ కాకుండా కీర్తి పండుగ అయ్యిందని, ఎటు చూసినా ఆకుపచ్చని తెలంగాణ, పాడి పంటల తెలంగాణ, పాడి పశువుల తె లంగాణగా మారి గ్రామీణ పల్లెలు మొత్తం ప చ్చదనంతో కళకళలాడుతున్నాయని వివరంచారు. సురవరం పేరిట సాహితీ వేత్తలను ప్రో త్సహించేలా చర్యలను చేపడుతామని, అందు కు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం నుంచి కల్పించేలా కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల, బాలుర జూనియ ర్‌ కళాశాల మైదానంలో వనపర్తి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సింగిరెడ్డి తారక మ్మ జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలను మంత్రి ప్రారంభించారు. కాసేపు సరదాగా బ్యాటింగ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీ ధర్‌, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, కౌ న్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, బండారుకృష్ణ, పుట్టపాకుల మహేశ్‌, నాగన్నయాదవ్‌, కదిరెజంపన్న,  విభూతి నారాయణ, చీర్లస త్యం, భాష్యనాయక్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆ ర్డినేటర్‌ హేమంత్‌, మాజీ కౌన్సిలర్లు ఆవుల ర మేశ్‌, తిరుమల్‌, నందిమల్ల శ్యాం, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు గిరి, నాయకు లు జాహంగీర్‌, నందిమల్ల సుభాష్‌, గోపాల్‌యాదవ్‌, కవులు, సాహితీవేత్తలు ఉన్నారు. 

VIDEOS

logo