ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Wanaparthy - Dec 31, 2020 , 00:47:19

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

వనపర్తి రూరల్‌ : గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కిచ్చారెడ్డి ఆధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.  సమావేశానికి జెడ్పీ చైర్మన్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్యవేక్షించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. విద్యుత్‌ సమస్యలు, మిషన్‌ భగీరథ పనులను పూర్తిచేసి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలపై అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, ఇలాగే కొనసాగితే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడొస్తాయని, మరణించిన వారి పేర్లను తొలిగించకుండా, ఉన్నవారి పేర్లను తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండా, నాచహళ్లిలో పశువైద్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. సర్పంచులు ఆయా గ్రామాల్లోని సమస్యలను జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీ, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఫీఖున్నీసాబేగం, ఎంపీవో రవీంద్రబాబు, ఏపీవో సుకన్య, సర్పంచులు భానుప్రకాశ్‌, కొండన్న, రామకృష్ణ, ఎంపీటీసీలు ధర్మనాయక్‌, రంగారెడ్డి, కురుమూర్తి, వివిధ శాఖ అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo