గురువారం 04 మార్చి 2021
Wanaparthy - Dec 31, 2020 , 00:04:49

36 నెలలుగా నిరంతరంగా

36 నెలలుగా నిరంతరంగా

  • సాగుకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా
  • నిరంతర విద్యుత్‌కు నేటితో    మూడేండ్లు పూర్తి
  • గద్వాల జిల్లాకు రూ.650 కోట్ల చెల్లింపు
  • సీఎం కేసీఆర్‌కు రైతన్నల కృతజ్ఞతలు 

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ ప్రారంభానికి నేటితో మూడేండ్లు పూర్తికానున్నది. 36 నెలలుగా నిరంతరంగా మోటర్లు పనిచేస్తున్నాయి. గతంలో కరెంట్‌ కోసం ఎదురుచూసే రోజుల నుంచి ఫుల్‌గా విద్యుత్‌ రాకతో రైతన్నలు పండుగలా పంటల సాగు చేపడుతున్నారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించి గద్వాల జిల్లాకు రూ.650 కోట్లు చెల్లించడంతో సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

నడిగడ్డ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే విద్యుత్‌ కష్టాలు తప్పవని, విద్యుత్‌ వైర్లపై బట్టలు ఆరబెట్టుకునే పరిస్థితి వస్తుందని ప్రతిపక్షాల మాటలను సీఎం కేసీఆర్‌ పటాపంచలు చేశారు. నిరంతర విద్యుత్‌ సరఫరా చేసి వారి మాట లు ఉట్టివేనని నిరూపించారు. వ్యవసాయానికి ఎనిమిది గంటల విద్యుత్‌ ఇవ్వడానికి గత పాలకులు నానాకష్టాలు పడేవారు. అది కూడా మూడు వి డుతల్లో ఇచ్చేవారు. పంటలు ఎక్కడ ఎండిపోతాయోనని రైతులు వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా కాపలా కాసేవారు. ఈ క్రమంలో విద్యుత్‌ ప్రమాదాలకు గురై వేల మంది మృత్యువాత పడేవారు. రాత్రి వేళల్లో పొలానికి నీరందించేందుకు వెళ్లి విషపురుగుల బారిన పడి ప్రాణాలు వదిలిన సంఘటనలూ ఉన్నాయి. ఇలాంటి బాధలకు స్వస్తి చెప్పాలని భావించిన సీఎం కేసీఆర్‌ 2018 జనవరి 1 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేడు రైతులు తమకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి నీటిని పారించుకుంటున్నారు. దీం తో పొలాల వద్ద విద్యుత్‌ మరణాలు 99 శాతం తగ్గాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకుగానూ సబ్‌స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేశారు. ఇందుకుగానూ దాదాపుగా రూ.70కోట్లు ఖర్చు చేసింది. రైతన్నలు సంబురంగా సా గు చేసుకుంటున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాకు నేటితో ముచ్చటగా మూడేండ్లు పూర్తి కానున్నాయి. 

రెట్టింపైన సబ్‌స్టేషన్ల సంఖ్య..

ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకుగానూ జి ల్లాలో గతంలో ఉన్న సబ్‌స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 34 సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 69 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే 11 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయగా, 24 గంటల విద్యుత్‌ తర్వాత మరో 24 సబ్‌స్టేషన్ల ఏర్పాటు కొనసాగుతున్నది. ఇందులో ఇప్పటికే 11 వినియోగంలోకి వచ్చాయి. పాతపాలెం, ఉప్పేరు, ఉప్పల, శ్రీనగర్‌, మన్నాపురం సబ్‌స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ఆరు నిర్మాణ దశలో ఉండగా.., పాలవాయి, రేవులపల్లిలో స్థల సేకరణ చేయాల్సి ఉన్నది. జిల్లాలో 13,350 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, ఇందులో వ్యవసాయానికి సంబంధించి 9,100, వ్యవసాయేతరానికి 4,200 ఉన్నాయి. జిల్లాలో 412 మంది సిబ్బంది విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నారు.


విద్యుత్‌ వినియోగించిన తీరు..

  • వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రభుత్వం ఏడాదికి దాదాపుగా రూ.300 కోట్లు విద్యుత్‌ శాఖకు చెల్లిస్తున్నది. ఉచిత విద్యుత్‌తో మూడు రెట్లు వినియోగం పెరిగింది. 
  • 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2018 మార్చి 31 వరకు జిల్లా మొత్తంగా 764.53 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం కాగా, వ్యవసాయానికి 181.69 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. ప్రభుత్వం విద్యుత్‌ శాఖకు రూ.107. 51 కోట్లు చెల్లించింది. 
  • 2018-19లో జిల్లా మొత్తంగా 916.61 మిలియన్‌ యూనిట్లు వినియోగించగా, వ్యవసాయానికి 432 మిలియన్‌ యూనిట్లు వాడుకున్నా రు. ప్రభుత్వం రూ.256.61 కోట్లు చెల్లించింది. 
  • 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జిల్లా మొత్తంగా 886.76 మిలియన్‌ యూనిట్లు వినియోగించగా, వ్యవసాయానికి 499.68 మిలియన్‌ యూనిట్లు వినియోగించా రు. ప్రభుత్వం రూ.295.31 కోట్లు చెల్లించింది. 
  • 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లా వ్యాప్తంగా 266.26 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినయోగం కాగా, వ్యవసాయానికి 176.75 మిలియన్‌ యూనిట్లు వినియోగించా రు. ప్రభుత్వం రూ.99.16 కోట్లు చెల్లించింది. 
  • ఉచిత విద్యుత్‌ ఇచ్చినప్పటి నుంచి మూ డేండ్లలో జిల్లా రైతుల తరఫున ప్రభుత్వం దాదాపుగా రూ.650 కోట్లు చెల్లించింది.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నది. రైతుబంధు, రైతుబీమాతోపాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుంది. రైతులు కూడా పగటి పూటనే పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు చాలా తగ్గిపోయాయి. 

- బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

సాగు పెరిగింది..

నిరంతర ఉచిత విద్యు త్‌ ఇస్తుండడంతో సాగు, పంటల దిగుబడి పెరిగిం ది. గతంలో 9 గంటల వి ద్యుత్‌ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. నే డు సంతోషంగా ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి నీళ్లు పారిస్తున్నారు. విద్యుత్‌ సంస్థ తరఫున రైతుల కు, ప్రజలకు మెరుగైన సేవలందిస్తాము. బకాయిలు చెల్లించడంతోపాటు ప్రతి ఒక్కరూ మీ టరు తీసుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలి. 

- చక్రపాణి, విద్యుత్‌ ఎస్‌ఈ, జోగుళాంబ గద్వాల

పగటి పూటే నీరు పారిస్తున్నాం.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నప్పటి నుంచి పగటి పూటనే పంటలకు నీరు పారించుకుంటున్నాం. గతంలో పంటలకు నీరుపెట్టేందుకు అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా వెళ్లేవాళ్లం. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు, విషపురుగుల బారిన పడి చాలా మంది చనిపోయేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకుంటున్నాం. సీం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. 

- తెలుగు శ్రీనివాసులు, జింకలపల్లి, ఇటిక్యాల

VIDEOS

logo