గురువారం 04 మార్చి 2021
Wanaparthy - Dec 26, 2020 , 01:14:06

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

  • చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు
  • కేక్‌కట్‌ చేసిసంబురాలు చేసుకుంటున్న  క్రైస్తవులు

వనపర్తి టౌన్‌ : క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు చర్చీలలో శుక్రవారం ఘనంగా  వేడుకలు నిర్వహించారు. క్రైస్తవులు నూతన వస్ర్తాలు ధరించి, బైబిల్‌ చేబూని పట్టణంలోని టౌన్‌ చర్చి, ఓలివ చర్చి, బెత్లహెం చర్చీ, హెబ్రోన్‌ చర్చి, బిలివర్స్‌ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు కేక్‌కట్‌ చేసి క్రిస్మస్‌ సంబురాలను జరుపుకున్నారు. 

యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

జిల్లా కేంద్రంలోని ఏజీ మినీ ఫంక్షన్‌హాల్‌లో యూనైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్‌ దళిత నేత వెంకటేశ్‌, డాక్టర్‌ ఎన్‌ఐ లివింగ్‌స్టన్‌ పాల్గొని కేక్‌కట్‌ చేసి క్రిస్మస్‌ సంబురాలను జరుపుకొన్నారు. అనంతరం  80 మంది పేదవారికి క్రిస్మస్‌ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు జయరాజు, స్వామిదాసు, బెంజమిన్‌,  జెరియా, కృపానంద్‌, యుగంధర్‌, సుందర్‌రాజు, లక్ష్మణ్‌, చర్చీల నిర్వాహకులు సుకన్య, రంగస్వామి, రాములు, బాలగోవింద్‌, పాస్టర్లు ఉన్నారు. 

క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ మంత్రి

వీపనగండ్ల : నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో మానవజీవితంలో దైవత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని చర్చి వద్ద నిర్వహించిన క్రి స్మస్‌ వేడుకల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్‌కట్‌ చేసి సంబురా లు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్‌ రా వు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, వీపనగండ్ల సర్పంచ్‌ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ గంగిరె డ్డి, రవీందర్‌రెడ్డి, చర్చి నిర్వాహకులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో..

ఆత్మకూరు :  ఆత్మకూరులోని బీఎంబీ చర్చిలో రెవ సీఏ జెర్మియ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్‌ఎస్‌ కల్చరల్‌ వింగ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సాయిచంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రార్థనలో పాల్గొని క్రిస్మస్‌ కేక్‌కట్‌ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రీయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు బోధనలను అందరూ ఆచరించాలన్నారు. అనంతరం మున్సిపల్‌ పాలకవర్గాన్ని, మాజీ సర్పంచ్‌ గంగాధర్‌గౌడ్‌ను సంఘం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఖానాపూర్‌లోని యేరుసలేం చర్చి వేడుకల్లోనూ మున్సిపల్‌ పాలకవర్గం ప్రతినిధులు పాల్గొని క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. చైర్‌పర్సన్‌ గాయత్రీయాదవ్‌ కేక్‌కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. 

మదనాపురంలో..

మదనాపురం : మండల కేంద్రంతోపాటు అజ్జకొల్లు దుప్పల్లి, నర్సింగాపురం, కొన్నూరు, వివిధ గ్రామాల చర్చీలలో శుక్రవారం క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని క్రైస్ట్‌ బాప్టిస్టు చర్చిలో ఎంపీపీ పద్మావతి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌నారాయణ, అజ్జకొల్లులో జెడ్పీటీసీ కృష్ణయ్య, దుప్పల్లిలో సర్పంచ్‌ శివశంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌కట్‌ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, విమల్‌ కుమార్‌, మనోజ్‌ కుమార్‌, మహేశ్‌ కుమార్‌, చర్చి సభ్యులు జేమ్స్‌ దేవదానం, సుందరయ్య, మోజస్‌, బాల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యం, కరుణాకర్‌రెడ్డి, చెన్నయ్య, రవి, వెంకట్రాములు, బాలరాజు పాల్గొన్నారు.

కొత్తకోటలో..

కొత్తకోట : పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కొత్తకోటలోని ఎంబీ చర్చి, సీయోన్‌ చర్చితోపాటు కనిమేట, పాలెం, కానాయపల్లి, అమడబాకుల, మీరాసిపల్లి, నాటవెల్లి, పామాపురం గ్రామాల్లో క్రైస్తవులు చర్చీల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, పాస్టర్లు రాజశేఖర్‌, ఆనందం, జేవీఆర్‌, అయ్యన్న, జయరాజు, ప్రశాంత్‌, సురేశ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo