బుధవారం 27 జనవరి 2021
Wanaparthy - Dec 06, 2020 , 06:23:25

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

వనపర్తి టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల నేతలు శనివారం జిల్లా కేం ద్రంలోని ధర్నాచౌక్‌లో ప్రధాని నరేంద్రమోడీ, అంబానీ, అదాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా మోడీ దిష్టిబొమ్మను దహ నం చేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సం ఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, రాజన్న, గోపి, బాల్‌రెడ్డి, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భగత్‌, రాధాకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేశ్‌, సీఐటీయూ రైతు సంఘాల నాయకులు రాజు, పరమేశ్వరచారి, భాస్కర్‌, రాములు, ఆంజనేయులు, కురుమన్న ఉన్నారు.logo