శనివారం 23 జనవరి 2021
Wanaparthy - Dec 06, 2020 , 06:23:25

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం

వనపర్తి విద్యావిభాగం : పదో తరగతి విద్యార్థులకు నేషనల్‌ టాలెంట్‌ సెర్ఫ్‌ పరీక్ష మొదటి లెవల్‌ పరీక్ష కోసం విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీన పరీక్ష నిర్వహించబడుతుందని, ట్రెజరీ బ్రాంచ్‌లో పరీక్ష రుసుము చలాన ద్వారా ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ముద్రిత దరఖాస్తులను రెండు సెట్లు, నామినల్‌ రూల్స్‌, చలాన్‌ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈనెల 16న అందించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, నాన్‌క్రిమిలేయర్‌, కుల, వైద్య, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు జతచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ వివరాలకు వెబ్‌సైట్‌ http://bse.telanagana.gov.in లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. 


logo