శనివారం 16 జనవరి 2021
Wanaparthy - Dec 05, 2020 , 00:23:42

మానవతా దృక్పథంతో విధులు నిర్వహించాలి

మానవతా దృక్పథంతో విధులు నిర్వహించాలి

  • ఎస్పీ అపూర్వరావు

వనపర్తి : మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించి క్ర మశిక్షణతో పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంచే విధంగా కృషి చే యాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. తొమ్మిది నెలల కఠోర శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకొని అక్టోబర్‌లో వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి నూతన ఉత్సాహం తో జిల్లాలో 6 మంది ఎస్సైలు, 55 మంది కానిస్టేబుళ్లు మొత్తం 61 మంది రిపోర్టు చేశారు. అందులో సివిల్‌ కానిస్టేబుళ్లు 35, ఆర్మూర్‌ రిజర్వు కానిస్టేబుళ్లు 20 మంది శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరం లో నూతన ఎస్సైలు, కానిస్టేబుళ్లతో ఎస్పీ అపూర్వరావు సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. నూతన ఉత్సాహంతో పని చేస్తూ ప్రజలపై మానవతా దృక్పథంతో ఉంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో ఎటువంటి తారతమ్య భేదంతో ఉండకుండా పనిచేసి వనపర్తి జిల్లా, రాష్ట్ర పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలు చెప్పే విషయాలను ఓపికగా వినాలని, రాగద్వేషాలకు, భావద్వేగాల కు లోనూకాకుండా నీతి నిజాయితీతో ఉద్యోగం నిర్వహించాలన్నారు. ప్రజల మనోభావాలను గౌరవి స్తూ ప్రజలకు సేవచేయాలని, బాధతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు చట్ట పరిధిలో ఏ విధంగా న్యాయం చే యగలమో ఆలోచించి దానికి తగ్గట్లుగానే ప్రజలకు న్యా యం చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, జిల్లా లో నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఎస్సైలు, కానిస్టేబు ళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.