రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
వీపనగండ్ల: మండలంలోని రంగవరం, గోపల్దిన్నే, వీపనగండ్ల గ్రామాల్లో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తున్నదన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్ తదితర పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. యాసంగి పంట చివరి వరకు జూరాల, భీమా, కేఎల్ఐ కాల్వలకు నిరంతరం నీరందించి ఆదుకోవాలని ఎమ్మెల్యేను మండల రైతులు కోరారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన మండ్ల వీరబాబు, పల్లవి నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. కార్యక్రమంలో పాన్‌గల్, తూంకుంట సింగిల్ విండో చైర్మన్లు మా మిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, సూరగౌని రామన్‌గౌడ్, ఎంపీపీ కమలేశ్వర్ రావు, సర్పంచులు నరసింహారెడ్డి, విజయ్‌కుమార్, రామేశ్వర్రావు, జయసుధ, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు వేణుమాధవరెడ్డి, యాదవస్వామి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌చంద్రి, సాయిబాబా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత