మంగళవారం 26 జనవరి 2021
Wanaparthy - Dec 02, 2020 , 02:34:05

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

వనపర్తి రూరల్‌ : మండలంలోని వనపర్తి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు సహకార చైర్మన్‌ వెంకట్రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. వరి విత్తనాలలో కేఎన్‌ఎం-118, ఆర్‌ఎన్‌ఆర్‌-15042, ఎంటీయూ 1010 రకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కేఎన్‌ఎం, ఎంటీయూ 25 కేజీల బస్తాలకు రూ.750, ఆర్‌ఎన్‌ఆర్‌ 25 కేజీల బస్తాకు రూ.800 చెల్లించాలని సూచించారు. అదేవిధంగా ఎరువులలో యూరియా, డీఏపీ, 20.20.13లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన రైతులు ఆధార్‌ , పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్‌లను తీసుకొని రావాలని తెలిపారు. logo