మంగళవారం 26 జనవరి 2021
Wanaparthy - Dec 02, 2020 , 02:33:56

58 సార్లు రక్తదానం చేసిన దాతకు సన్మానం

58 సార్లు రక్తదానం చేసిన దాతకు సన్మానం

వనపర్తిఅర్బన్‌ : 58 సార్లు రక్తదానం చేసిన కొండూరు ప్రవీణ్‌కుమార్‌ను రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ఖాజాకుతుబుద్దీన్‌ సన్మానించారు. మంగళవారం జిల్లా రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో ప్రవీణ్‌కుమార్‌ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ మాట్లాడుతూ మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ సేవలు వెలకట్టలేనిదన్నారు. వీరితోపాటు యాదగిరి, బచ్చు భరత్‌కుమార్‌ రక్తదానం చేసినట్లు తెలిపారు. అనంతరం 58వ సారి రక్తదానం చేసిన ప్రవీణ్‌కమార్‌ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నట్లు, ఊపిరి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం నాలుగు పర్యాయాలు రక్తదానం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా పాలకమండలి సభ్యురాలు చెన్నమ్మథామస్‌, టెక్నీషియన్లు లక్ష్మీపతి, వహీద్‌, మహమూద్‌, పాషా, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.logo