ఎమ్మెల్యే నర్సింహయ్య మృతి దురదృష్టకరం

- మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్
వనపర్తి : నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మంగళవారం హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నర్సింహయ్య మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు మహేశ్, సత్యం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్, మాజీ కౌన్సిలర్ తిరుమల్, పట్టణ అధ్యక్షుడు గిరి, నాయకులు మహేశ్, పరంజ్యోతి, కృష్ణ, రహీం, గోపాల్ యాదవ్, రామస్వామి పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం : ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం మృతిచెందడంపై టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
పాన్గల్లో..
పాన్‌గల్ : ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం మృతి చెందడంపై టీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌నాయక్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రూనాయక్, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మయ్య ఉన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట : ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిచెందడంపై పట్టణంలోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌నారాయణ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, పట్టణాధ్యక్షుడు రాములుయాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకుడు శ్రీనూజీ, కౌన్సిలర్లు రామ్మోహన్‌రెడ్డి, ఖాజమైనొద్దీన్, తిరుపతయ్య, రాములుయాదవ్, కోఆప్షన్ సభ్యులు సుజాత, నాయకులు యాదయ్యసాగర్, పెంటన్న, సాజద్, అయ్యన్న, హనుమంతుయాదవ్, వెంకటన్నగౌడ్, మహేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్‌కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని