కేజీబీవీలో ఎంసెట్ శిక్షణ ప్రారంభం

వనపర్తి విద్యావిభాగం : బాలికల అభివృద్ధితోపాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధి కోసం కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు ఎంసెట్ శిక్షణను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. వలస విద్యార్థినులకు అర్ఫన్, సెమీ అర్ఫన్ విద్యార్థులకు విద్య దూరం కాకుండా ఉండేందుకు కేజీబీవీలను ప్రారంభించగా అవి దినదినంగా అభివృద్ధి చెందుతూ 10వ తరగతితోపాటు ఇంటర్ విద్యను అందించేందుకోసం జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట, గోపాల్పేట కేజీబీవీ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు ఆంగ్ల మాధ్యమ కస్తుర్బా గాంధీ పాఠశాలలను ప్రారంభించారు. ఇంటర్ చదువుతున్న ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించేందుకోసం శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా కోచింగ్ కేంద్రాల్లో పనిచేసిన అనుభవం ఉన్న నిపుణులైన అధ్యాపకులచే ఆన్లైన్ ద్వారా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు. బైపీసీలో 40మంది, ఎంపీసీలో 46 మొత్తం 86 మందికి ఆన్లైన్ వెబినార్ ద్వారా ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులు సాధారణ విద్యతోపాటు పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోమదపడుతున్నది.
బాలికలకు శిక్షణ ఇవ్వడం వరం
కేజీబీవీ విద్యార్థినులకు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం వరంలాంటిది. విద్యార్థులను కరోనా ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా శిక్షణ విజయవంతమయ్యేందుకు సన్నద్ధం చేస్తున్నాం. ప్రతిభ ఉన్న విద్యార్థినులు ఈ శిక్షణ ద్వారా అర్హత సాధించడంతోపాటు పోటీ పరీక్షలకు తాము కూడా ఫలితాలు సాధించగలమనే విశ్వాసంతో ముందుకుసాగుతున్నారు.
- లోహిత, కేజీబీవీ ఎస్వో, మర్రికుంట
బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు
డ్రాప్ అవుట్‌ను, విద్యకు దూరం కాకుండా బాలికలకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన కేజీబీవీలు క్రమక్రమంగా లక్ష్యాలను మార్చుకుంటూ విద్యార్థినులు పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు సరైన శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినులు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ ఇతరత్ర పోటీ పరీక్షల్లో వనపర్తి జిల్లా నుంచి సీట్లు సాధించారు. ఈ ఏడాది కూడా ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలి.
- వనంతలక్ష్మీ, జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారిణి
తాజావార్తలు
- బ్రాహ్మణుల కోసం అపరకర్మల భవనం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
- ఓటీపీ వచ్చిందా.. రేషన్ తీసుకో..!
- వైభవంగా పెద జీయర్ స్వామి పరమ పదోత్సవం
- నిఘా కన్ను ఛేదనలో దన్ను
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం