గురువారం 28 జనవరి 2021
Wanaparthy - Dec 01, 2020 , 05:01:34

రాజీ కుదుర్చుకునేందుకు చొరవ చూపాలి

రాజీ కుదుర్చుకునేందుకు చొరవ చూపాలి

వనపర్తి టౌన్‌ : ఎక్కువ కక్షిదారులను రాజీ కుదుర్చుకునేందుకు చొరవ చూపాలని జిల్లా 9వ అదనపు న్యాయమూర్తి శ్రీనివాసులు సూచించారు. సోమవారం జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 12న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకొని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులకు ఆయన సూచించారు. రాజీ మార్గంతో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు తిరుపతయ్యగౌడ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, కల్యాణి, వెంకటరమణ, రాజు, మోహన్‌కుమార్‌, చంద్రశేఖర్‌రావు, కృష్ణవర్ధన్‌రెడ్డి, దివ్య, న్యాయవాదులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo