సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Dec 01, 2020 , 05:01:31

అభివృద్ధి దిశగా పనులు చేస్తాం..

అభివృద్ధి దిశగా పనులు చేస్తాం..

  •  మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌

వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అధికారులు, కౌన్సిల్‌ సభ్యుల సమన్వయంతో ముం దుకు సాగుతామని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి అ ధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ అభివృద్ధి దిశగా 40 ఎజెండా అంశాలను సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపారు. 

మాజీ కౌన్సిలర్‌ మృతికి సంతాపం

   మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ సరిత ఇటీవల మృతి చెందారు. సాధారణ సమావేశంలో సోమవారం 33వ వార్డు కౌన్సిల ర్‌ ఉంగ్లం అలేఖ్య మాజీ కౌన్సిలర్‌ సరిత మృతికి సంతాపం తెలపాలంటూ సభ్యులకు ప్రతిపాదించగా మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అనుమతితో రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్‌ ఉంగ్లం తిరుమల్‌  తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, రమాదేవి, సమద్‌, పద్మ, శాంత, రవి, రాములు, విభూతినారాయణ, భాష్యనాయక్‌, జయసుధ, సుమిత్ర, అలివేలు, మహేశ్‌, బ్రహ్మచారి, కృష్ణ, పద్మ, ఉన్నీసాబేగం, సత్యమ్మ, చంద్రకళ, పాకనాటి కృష్ణ, వెంకటేశ్వర్లు, సత్యం, భువనేశ్వరి, లక్ష్మి, జంపన్న, లక్ష్మిదేవి, మంజులయాదవ్‌, భారతి, రాధాకృష్ణ, నాగన్న యాదవ్‌, మున్సిపల్‌ మేనేజర్‌ ఖాజా, ఏఈ భాస్కర్‌, మున్సిపల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.