సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Nov 30, 2020 , 02:16:24

జిల్లా స్థాయి క్రీడల్లో అప్పరాల విద్యార్థుల ప్రతిభ

జిల్లా స్థాయి క్రీడల్లో అప్పరాల విద్యార్థుల ప్రతిభ

కొత్తకోట : మదనాపురం మండల కేంద్రంలోని సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో మండలంలోని అప్పరాల గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటారు. విస్డమ్‌ లిగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో సాధించినట్లు గ్రామస్తు లు తెలిపారు. జిల్లా స్థాయి అండర్‌-17 క్రీడల్లో శిరీష శాట్‌ఫుట్‌, లాంగ్‌జంప్‌ ప్రథమ స్థానం, పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించారు. అలాగే ఎండీ సమీర్‌ అనే విద్యార్థి పరుగు పందెం, క్విజ్‌, స్పీచ్‌, స్పేల్‌బీలో ద్వితీయ స్థానం, స్పీడ్‌ మ్యాథ్స్‌ తృతీయ స్థానం డిబెట్‌లో అర్హత సాధించారు. అదేవిధంగా వెంకటేశ్‌ శాట్‌ఫుట్‌, లాంగ్‌జంప్‌లో ప్రథమ స్థానం సాధించారు.