సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Nov 30, 2020 , 02:10:09

బెట్టింగ్‌ జూదానికి యువకుడి బలి

బెట్టింగ్‌ జూదానికి  యువకుడి బలి

  • హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న  అయ్యవారిపల్లె యువకుడు

చిన్నంబావి: తక్కువ సమసయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో నేటితరం యువత ఆన్‌లైన్‌ జూదాలు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఆదే కోవలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలై డబ్బులు కట్టలేక వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లెకి చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.   అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన మేకల చిన్న బిచ్చన్న కొడుకు విజయ్‌కుమార్‌(25) పదో తరగతి వరకు గ్రామంలోనే చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పటాన్‌చెరు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఏడాదిన్నర కిందట అదే గ్రామానికి చెందిన యువతితో వివాహం జరగగా.. ఉద్యోగరీత్యా రాజధానిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి దాదాపు రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అతనికి భార్య దివ్యతోపాటు 6 నెలల బాబు ఉన్నాడు.