జ్యోతిబా ఫూలేను స్మరించుకోవాలి

వనపర్తి : భారతావనిని నిర్మించిన మహానీయుడు, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలేను నేటి సమాజం స్మరించుకోవాలని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫూలే వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే తన భార్యను దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది మహిళలకు వి ద్యను అందించిన దార్శనికుడని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగన్న యాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, నాయకులు శరవంద, కృష్ణ, భాగ్యరాజ్, బీచుపల్లియాదవ్, కోఆప్షన్ సభ్యుడు గులాంఖాదర్ పాల్గొన్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు/రూరల్ : బడుగు, బలహీన వర్గాల బతుకుల తొలి పొద్దుగా మహాత్మా జ్యోతిబాఫూలే నిలిచారని మత్స్యకారుల సంఘం మండలాధ్యక్షుడు బాలస్వామి అ న్నారు. శనివారం ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని సుభాష్‌చంద్ర బోస్ చౌరస్తాలో జ్యోతిబా ఫూలే యువజన సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఫూలే మార్గంలో నడవా లని సూచించారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రా మంలో శనివారం ఫూలే వర్ధంతి నిర్వహించుకున్నారు. గ్రామ కూడలిలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు భరత్‌కుమార్, సహదేవుడు, బాలరాజు, అరవిందు, బాలవర్ధన్, వినోదు, భాను, రమేశ్, శివ, జయరాం, రఘు, దేవిప్రసాద్, బుచ్చన్న, బీజేపీ నాయకలు శ్రీనివాస్‌గౌడ్, విజయకుమార్, భగవంతు, నాగరాజు పాల్గొన్నారు.
సామాజిక విప్లవమూర్తి ఫూలే
వనపర్తి విద్యావిభాగం : సామాజిక విప్లవమూర్తి, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతి బాఫూలే అని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చందోజీరావు, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు రాజారాంప్రకాశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో, ఉద్యోగ, ప్రజా సంఘాలు, డిగ్రీ కళాశాలలో బోధన సిబ్బంది జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి వేర్వేరుగా పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సురేందర్‌రెడ్డి, రమేశ్, విష్ణుమోహన్, రామకృష్ణ, ఉదయ్‌కుమార్, కురుమయ్య, మూర్తి, యాదగిరిగౌడ్, రాఘవేం ద్ర, రామకృష్ణ, మలికార్జున్, విజయలక్ష్మి, ఉమా, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు గిరిరాజచారి, నరసింహాశర్మ, వెంకటయ్య, నాగేంద్రం, ఈశ్వర్, నాగన్న, నాగరాజు ఉన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో..
ఆత్మకూరు : అమరచింత మండల కేంద్రంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఫూలే జయంతిని నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళల చదువుకు పోరాటాలు చేసి, తన భార్య నుంచే ప్రారంభించిన మహానీయుడు ఫూలే అని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్, సీపీఐఎం టౌన్ కార్యదర్శి వెంకటేశ్, డీవైఎఫ్ఐ జిల్లా కోకన్వీనర్ రాఘవేంద్ర, వెంకి, ప్రశాంత్, ధన్పాల్, ఆనందం, సురేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యవసాయశాఖ పొలం- హలం శాఖగా మారాలి : సీఎం
- నేపాల్ ప్రధానిని బహిష్కరించిన కమ్యూనిస్ట్ పార్టీ
- హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా రహస్య డేటా చోరీకి టెక్కీ యత్నం!