సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Nov 29, 2020 , 04:03:30

ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

  • ఎన్నికల శిక్షణకు హాజరుకానందున వేటు
  • వెల్లడించిన వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

వనపర్తి : ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా శనివారం ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు నియమించబడి ఈ నెల 27వ తేదీన శిక్షణకు హాజరుకానందున జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కృష్ణమోహన్‌లను ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణకు హాజరుకావాలని రాత పూర్వకంగా తెలియజేసినప్పటికీ రాలేదని పేర్కొన్నారు. వరప్రసాద్‌కు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని, కృష్ణమోహన్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారని, ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహించినందుకు తక్షణమే ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.