నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

వనపర్తి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశాపెట్టిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రాజు, గోపాలకృష్ణ, రాములు, రాజశేఖర్, చంద్రయ్య, బీసన్న, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
లాఠీచార్జి చేయడం దారుణం
ఆత్మకూరు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరా టం చేస్తున్న రైతులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆ ఘటనను నిరసిస్తూ శుక్రవారం అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలో ఆపార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సర్కారు దిష్టి బొమ్మను దహ నం చేశారు. ఈనెల 26, 27న చేపట్టిన గ్రామీణబంద్, చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన రైతులపై ఢిల్లీ సరిహద్దుల్లోనే బీజేపీ సర్కారు పోలీసు బందోబస్తుతో భాష్పవాయువు ప్రయోగించి, జల ఫిరంగులతో గాయపర్చడాన్ని న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హన్మంతు, నాయకులు మునియప్ప, ఆంజనేయులు, మురళి, వినోద్, నరసింహ, విజయ్‌కుమార్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.