శనివారం 23 జనవరి 2021
Wanaparthy - Nov 27, 2020 , 02:22:20

కదంతొక్కిన కార్మికులు

కదంతొక్కిన కార్మికులు

  • కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వివిధ సంఘాల నిరసనలు
  • విజయవంతమైన సార్వత్రిక సమ్మె

వనపర్తిటౌన్‌/ఆత్మకూరు/పెబ్బేరు/కొత్తకోట/మదనాపురం/వీపనగండ్ల/చిన్నంబావి/ఖిల్లాఘణపురం/పాన్‌గల్‌ : కేంద్ర సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వివిధ కార్మిక, కర్షక, వామపక్ష పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, పెబ్బే రు, కొత్తకోట, మదనాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మం డల కేంద్రాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శనలతో నిరసనలు నిర్వహించి సమ్మెను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలువురు మాట్లాడుతూ ప్రజా, రైతు, కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా మోడీ సర్కారు పాలన సాగిస్తున్నదన్నా రు. ప్రైవేటీకరణతో సామాన్య ప్రజల నడ్డి విరిచేందుకు యత్నిస్తుందన్నారు. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల తో రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు చూస్తుందన్నారు. కార్మి క చట్టాల సవరణతో కార్మికుల శ్రమను దోచేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. పనిగంటల పెంపుతో అసంఘటిత రంగాల, కర్షకుల కష్టాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ప్రజా వ్యవస్థను దుర్భరం చేసేలా సాగిస్తున్న కేంద్ర సర్కారు పాలనపై అన్ని సంఘాలు విమర్శలు గుప్పించాయి. పాలన తీరును మార్చుకొని ప్రజా వ్యతిరేక విధానాలపై పునరాలోచించి అందరి శ్రేయస్సుకు పనిచేయాలని కోరారు. వనపర్తిలో రా జీవ్‌చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా కలెక్టర్‌ కార్యాలయం వరకు సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పెబ్బేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ నుంచి కొల్లాపూర్‌ చౌరస్తా వరకు సంఘాల నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, రై తు, ప్రజా వ్యతిరేక విధాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కొత్తకోట, మదనాపురం కేంద్రాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్‌ ఆధ్వర్యంలో  సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. వీపనగండ్ల మండల కేంద్రంతోపాటు మండలంలో ని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నే, రంగవరం, సంగినేనిపల్లి, బొల్లారం, కొర్లకుంట తదితర గ్రామాల్లో గ్రామీణ బంద్‌ను జయప్రదం చేశామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు కార్మికులు, కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెలో భాగంగా గురువారం చిన్నంబావి మండల కేంద్రంలో గ్రా మీణ సమ్మె విజయవంతంగా ముగిసింది.  కేంద్ర ప్రభు త్వం కార్పొరేట్‌ బడాబాబుల జేబులు నింపడానికి నూతన వ్యవసాయ చట్టంతో చిన్న, సన్నకారు రైతుల ఉసురుపోసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని కోరు తూ గురువారం  కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఖిల్లాఘణపురం తాసిల్దార్‌ వెంకటకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని పాన్‌గల్‌ మం డల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట గురువా రం ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ, పంచాయతీ సిబ్బంది, హమాలీ, వ్యవసాయ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో  సంఘాల కార్మిక నాయకులు మహమ్ముద్‌, శ్రీహరి, రమేశ్‌, బుచ్చన్న, కురుమూర్తి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపి, అరుణ్‌కుమార్‌, ప్రసాద్‌, అజయ్‌, రాజు, ఎంపీటీసీ హన్మంతు, రాజన్న, భాస్కర్‌, శ్యామ్‌సుందర్‌, అబ్రహాం, తిరుమలేశ్‌, రవీందర్‌, రాబర్ట్‌, రాజు, ఖాజా, వెంకటయ్య, ఊషన్న, వెంకటేశ్‌, హనీఫ్‌, సువర్ణ, ఉమేశ్‌గౌడ్‌, శ్రీను, వెంకటయ్య,  జనార్దన్‌, ఆశన్న, భాగ్య, మంజు ల, రాణి, రాజు, శారదమ్మ, అనసూయ, విష్ణు, మన్యం, చెన్నయ్య, అజయ్‌, వెంకట్రాములు, మొగిలి, సర్పంచ్‌ మౌలాలి, మహబూబ్‌పాషా, శేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌, ఖాజాహుస్సేన్‌, కురుమయ్య, సత్యనారాయణ, బాలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఉపాధిహామీ కార్మికులు, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సంఘాల నాయకులు జంగాచిన్నబాబు, వెంకటస్వామి, హుస్సేన్‌, బాలస్వామి, మల్లయ్య, నర్సింహ, బాలమ్మ, శాంతయ్య, పుట్ట ఆంజనేయులు, గోపాలకృష్ణ, అరుణ్‌కుమార్‌, నాగేశ్వర్‌, మోహన్‌, యాదగిరి, కురుమయ్య, చంద్రయ్య, బుచ్చన్న, లక్ష్మి, రా జారాంప్రకాశ్‌, డప్పు నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌, నారాయ ణ, సరోజ, సరళ, రాధ, సునీత, దేవేందర్‌, భగత్‌, వెంకట య్య, రేణుక, అలివేలు, ఆంజనేయరెడ్డి, పరశురాములు, కురుమయ్య, ఫయాజ్‌, భాస్కర్‌గౌడ్‌, మహేశ్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. logo