శనివారం 23 జనవరి 2021
Wanaparthy - Nov 27, 2020 , 02:16:35

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

వనపర్తి టౌన్‌/ఆత్మకూరు/గోపాల్‌పేట/కొత్తకోట/వనపర్తి రూరల్‌/రేవల్లి/శ్రీరంగాపూర్‌ : జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పాలకవర్గం ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో నర్సింహులు మాట్లాడుతూ భారత రాజ్యం గం ఆమోదించడంతో దేశంలో కొత్త నవ సమాజం మొదలైందని జెడ్పీ సీఈవో అన్నారు. గురువారం జిల్లా పరిష త్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోదం పొందిన రోజునూ పురస్కరించుకొని సిబ్బందితో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా చైర్‌పర్సన్‌ గాయత్రీయాదవ్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొందిన ది నోత్సవాన్ని న్యాయ దినోత్సవంగా జరుపుకుంటుండడం మన ర్యాజ్యాంగం గొప్పతనమన్నారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ అంబేద్కర్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. గోపాల్‌పేట మండలంలో ని బుద్దారం గ్రామంలో అంబేద్కర్‌ విజ్ఞాన సేవాకేంద్రం ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొత్తకోట మండల కేంద్రం లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహాని కి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవల్లిలో డీఎస్పీ (దళిత ప్రోగ్రాం) ఆధ్వర్యంలో భార త రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరంగాపూర్‌ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్‌ శివకుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గాయత్రి ఆధ్వర్యం లో భారతరాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ శివకుమార్‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువా రం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఉద్యోగ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సం స్థల ఆధ్వర్యంలో వేర్వేరుగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల లో జాతీయ సేవా పథకం(ఎన్‌సీసీ) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ చందోజీరావు నిర్వహించారు. ఉద్యోగ, ప్రజా సంఘాలు, స్వచ్ఛం ద సంస్థలు, దళిత సంఘాల యూత్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్‌, సర్పంచ్‌ పద్మమ్మ, ఉపసర్పం చ్‌ నాగరాజు, ఎంపీటీసీ శ్రీదేవి, గ్రామస్తులు శివకుమార్‌, బలపీరు, వెంకటేశ్‌, రావణ్‌, ఓకాంర్‌, చంద్రయ్య, శివా జీ, రాము, మల్లేశ్‌, హనుమంతు, ప్రశాంత్‌, బోయేజ్‌, శ్రీనివాస్‌రెడ్డి, అయ్యన్న, ఇజ్రాయిల్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సుభాశ్‌, సంగీతరాజు, వసీంఖాన్‌, ప్రసాద్‌, ప్రశాంత్‌, కిరణ్‌, రాములుసాగర్‌, ముజీబ్‌, మల్లేశ్‌యాదవ్‌, శ్రీకాంత్‌, డీఎస్పీ నాయకులు కురుమన్న, ఎల్లప్వామి, చిన్నరాములు, రాము, శివ, బాలరాజు, కృష్ణకుమార్‌, రాము, చిరంజీవి, అనిల్‌, కిశోర్‌, శివ, కిరణ్‌మోహన్‌, రత్నం, పుష్ప, నాగేశ్వర్‌, నాగన్న, నిరంజన్‌, కృష్ణ, శ్రీనివాసులు, వెంకటస్వామి, ఆంజనేయులు, కురుమయ్య, రత్నం, వెంకటయ్య, మధు, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo