బుధవారం 27 జనవరి 2021
Wanaparthy - Nov 26, 2020 , 02:02:39

‘నివర్‌'పై అప్రమత్తం

‘నివర్‌'పై అప్రమత్తం

  • రెండ్రోజులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావొద్దు
  • మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగా ణపై నివర్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకా శం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు.  రా ష్ట్ర వ్యాప్తంగా రైతులు రెండు రోజులపాటు పత్తి, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దని సూచించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పత్తి, ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగో లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు కప్పడం లేదా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉం డాలని మంత్రి సూచించారు. ఉద్యోగులు కొనుగోలు కేంద్రాలను వదిలి వెళ్లొద్దన్నారు. ఆయా జి ల్లా రీజినల్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. సమస్యలు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.


logo